Kuwait: కువైట్ దేశం నుండి లక్ష మంది అక్రమ విదేశీ వలసదారుల బహిష్కరణకు రంగం సిద్ధం..!

తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న సుమారు లక్ష మందిని వెనక్కి పంపాలని కువైట్ నిర్ణయించింది. అలాగే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ ప్రభుత్వం స్వల్పకాలిక జరిమానా - మాఫీ పథకాన్ని నిలిపివేసింది. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను బహిష్కరించాలని కూడా నిర్ణయించారు.

Kuwait: కువైట్ దేశం నుండి లక్ష మంది అక్రమ విదేశీ వలసదారుల బహిష్కరణకు రంగం సిద్ధం..!
Kuwait Airport
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 23, 2024 | 5:56 PM

తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న సుమారు లక్ష మందిని వెనక్కి పంపాలని కువైట్ నిర్ణయించింది. అలాగే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ ప్రభుత్వం స్వల్పకాలిక జరిమానా – మాఫీ పథకాన్ని నిలిపివేసింది. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను బహిష్కరించాలని కూడా నిర్ణయించారు. ఇది అక్రమ విదేశీయులను నియమించుకునే కువైట్ వ్యక్తులు, కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

కువైట్ ప్రభుత్వం 2020 సంవత్సరానికి ముందు దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారులను జరిమానాలు చెల్లించిన తర్వాత ఉండటానికి అనుమతించింది. కానీ ప్రభుత్వం ఈ ఆర్డర్‌ను స్వల్పకాలికంగా ఉంచింది. అయితే తాజాగా ఈ స్వల్పకాలిక ఆర్డర్‌ను నిలిపివేసింది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న దాదాపు 1,10,000 మంది విదేశీయులు ఈ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటి వారు కొత్త సమస్యను ఎదుర్కొక తప్పదు.

రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిని బహిష్కరించే ప్రణాళికతో కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందుకు సాగుతోంది. కువైట్ ఇటీవల అక్రమ విదేశీ నివాసితులపై కఠినమైన చర్యలు తీసుకుంది. అక్రమ నివాసిని దాచిపెట్టిన ప్రవాసులెవరైనా కూడా బహిష్కరించబడతారని హెచ్చరించింది. అక్రమ వలసదారులను నియమించుకున్న కువైట్ వ్యక్తులు లేదా కంపెనీలు అక్రమ వలసదారులను అక్రమంగా ఆశ్రయించడం, దాచడం వంటి అభియోగాలను ఎదుర్కొంటారని కువైట్ సర్కార్ తెలిపింది.

కువైట్ జనాభాలో ఎక్కువగా విదేశీయులే

కువైట్ వార్తాపత్రిక అల్ అన్బా, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం జారీ చేసిన ఆర్డర్ అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వ్యవస్థ నుండి ప్రయోజనం పొందుతున్న అక్రమ వ్యక్తుల సంఖ్య సుమారు 1,10,000 మంది విదేశీయులకు చేరుకుంది. కువైట్ మొత్తం జనాభా 4.6 మిలియన్లలో విదేశీయుల సంఖ్య సుమారు 3.2 మిలియన్లు. దేశం తన జనాభా అసమతుల్యతను పరిష్కరించడానికి, కువైటైజేషన్ ఉపాధి విధానంలో భాగంగా విదేశీ కార్మికులను.. స్వంత పౌరులతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల కువైట్‌లో విదేశీయుల ఉపాధిని అరికట్టాలనే డిమాండ్ పెరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…