ఇజ్రాయెల్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టీకరణ, త్వరలో ఈ ‘చాఫ్టర్’ముగుస్తుందని వ్యాఖ్య

| Edited By: Anil kumar poka

May 13, 2021 | 12:01 PM

ఇజ్రాయెల్ దేశానికి తనను తాను రక్షించుకునే హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడానని, ఎప్పుడో ఒకప్పుడు..

ఇజ్రాయెల్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టీకరణ, త్వరలో ఈ  చాఫ్టర్ముగుస్తుందని వ్యాఖ్య
Joebiden Speaks To Benjamin Netanyahu On Conflict Between Israel And Hamas
Follow us on

ఇజ్రాయెల్ దేశానికి తనను తాను రక్షించుకునే హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడానని, ఎప్పుడో ఒకప్పుడు..సాధ్యమైనంత త్వరగా ఈ ‘చాఫ్టర్’ ముగుస్తుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. మీ దేశ భూభాగంపైకి వేలాది రాకెట్లు వచ్చి పడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవలసిందే అని నెతన్యాహూకు చెప్పానని అన్నారు.గాజా సిటీ నుంచి హమాస్ జెరూసలేం పైకి వందలాది రాకెట్లు ప్రయోగిస్తుండగా ఇజ్రాయెల్ ..గాజాపై వైమానిక దాడులను కొనసాగిస్తోంది.నిన్న జరిగిన వైమానిక దాడుల్లో సీనియర్ హమాస్ మిలిటెంట్ నేతలు కొందరు హతులైనట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తో బాటు మధ్యప్రాచ్యంలోని పలు దేశాలతో సదా భద్రతకు సంబంధించి తాము టచ్ లో ఉంటామని బైడెన్ చెప్పారు.ఈజిప్ట్, సౌదీ, ఎమిరేట్స్..ఇలా అన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతుంటామని ఆయన వెల్లడించారు.పాలస్థీనాతో ఇజ్రాయెల్ పోరాటం త్వరలో ముగిసే సూచనలున్నాయన్నారు. కాగా తను పాలస్తీనా అధ్యక్ధుడు మహమూద్ అబ్బాస్ తో ఫోన్ లో మాట్లాడినట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. మీ రాకెట్ దాడులను నిలిపివేయాలని తాను కోరినట్టు ఆయన చెప్పారు.ఇందుకు ఆయన నుంచి స్పందన లేదన్నారు.

అటు-ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకరంగా ఇంకా పోరు కొనసాగుతోంది. హమాస్ టెర్రరిస్టులు 11 మందిని ఇజ్రాయెల్ హతమార్చగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో 16 మంది పిల్లలతో బాటు 70 మందికి పైగా మరణించారు. పాలస్తీనా మరో 130 రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. మరోవైపు… ఉభయ పక్షాలూ సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి మళ్ళీ కోరింది. ఉద్రికతల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని, శాంతి చర్చలకు పూనుకోవాలని కోరింది.

మరిన్ని చదవండి ఇక్కడ :ఆ సీన్‌లో నటించింది పవన్‌ కాదు ..గబ్బర్ సింగ్ మూవీపై డైరెక్టర్ హరీష్ శంకర్ సన్షేనల్ కామెంట్స్

కరోనా దెబ్భకి 20రోజుల్లో కుటుంబం బలి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో విషాద ఘటన..!(వీడియో):coronavirus video.

విఘ్నేష్‌తో పెళ్లికి నయన్‌ నో ..! ఎన్నో సార్లు నయనతార పెళ్ళికి బ్రేక్ లు ..ఈ సారి రీసన్ ఏంటి ?:Nayantara say no marrie video.