Bungee Jump: ప్రపంచంలోనే ఎత్తైన మకావు టవర్‌ పై నుంచి బంగీ జంపింగ్‌ .. అంతలో ఊహించని ప్రమాదం

చైనాలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బంగీ జంప్ ప్లాట్‌ఫారమ్‌ నుంచి కిందకి దూకిన జపాన్ టూరిస్ట్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మకావు టవర్‌పై నుంచి కిందకు దూకిన పర్యాటకుడు నేలపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే మరణించాడు. ఆదివారం మకావు మునిసిపాలిటీలో ఉన్న 764 అడుగుల మకావు టవర్‌పై నుంచి అతను కిందకు దూకాడు. దీంతో అతన్ని అత్యవసర చికిత్స కోసం కొండే ఎస్. జనువారియో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స..

Bungee Jump: ప్రపంచంలోనే ఎత్తైన మకావు టవర్‌ పై నుంచి బంగీ జంపింగ్‌ .. అంతలో ఊహించని ప్రమాదం
Bungee Jump

Updated on: Dec 05, 2023 | 5:16 PM

బీజింగ్, డిసెంబర్‌ 5: చైనాలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బంగీ జంప్ ప్లాట్‌ఫారమ్‌ నుంచి కిందకి దూకిన జపాన్ టూరిస్ట్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మకావు టవర్‌పై నుంచి కిందకు దూకిన పర్యాటకుడు నేలపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే మరణించాడు. ఆదివారం మకావు మునిసిపాలిటీలో ఉన్న 764 అడుగుల మకావు టవర్‌పై నుంచి అతను కిందకు దూకాడు. దీంతో అతన్ని అత్యవసర చికిత్స కోసం కొండే ఎస్. జనువారియో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స ప్రారంభించిన కొద్ది సమయానికే మరణించాడు. దీనిపై అక్కడి పోలీసులు విచారణ ప్రారంభించారు.

బంగీ జంప్ అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్‌లు సందర్శనకు వచ్చే ముందు కొన్ని సూచనలు చేస్తుంది. ఇందులో పాల్గొనే కస్టమర్లకు ఏవైనా వైద్యపరమైన సమస్యలు ఉంటే తమకు తెలియజేయమని కస్టమర్‌లకు కోరుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ముందస్తు జాగ్రత్తలు సూచిస్తుంది. అక్కడ బంగీ జంప్‌ను AJ హ్యాకెట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇక్కడి స్కైపార్క్‌లో ఒక రౌండ్ ధర సుమారు రూ.25,000. ఈ కంపెనీ ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్‌లలో కూడా బంగీ జంప్‌లను నిర్వహిస్తుంది. ఈ కంపెనీ 30 సంవత్సరాలలో నాలుగు మిలియన్ జంప్‌లను విజయవంతంగా పూర్తి చేసినట్లు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. పర్ఫెక్ట్ సేఫ్టీ రికార్డులో ఎప్పుడూ అంచనాలు తప్పింది లేదు.

ఇవి కూడా చదవండి

చైనాలో ఉన్న మకావు టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్లాట్‌ఫారమ్. 2019 లో పోలాండ్‌లో 330 అడుగుల బంగీ జంప్ సమయంలో 39 ఏళ్ల వ్యక్తి తన తాడు తెగిపోవడంతో నేలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముకకు గాయాలయ్యాయి. గ్డినియాలోని ఓ థీమ్ పార్క్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ అప్పట్లో వైరల్‌ అయ్యింది. అతను ప్లాట్‌ఫారమ్ నుంచి దూకిన తర్వాత అతని బంగీ తాడు తెగిపోయి నేలపై పడిపోయాడు.

No.1 న్యూస్‌ నెట్‌వర్క్‌.. No.1 ఎలక్షన్‌ కవరేజ్‌.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.