New Baba Vanga: జూలై 5 జలప్రళయం తప్పదా? సునామీ ముంచెత్తబోతోందా?

జూలై 5న ఏం జరగబోతోంది. ఆ రోజును తలచుకుని జపాన్‌ ఎందుకంతగా భయపడిపోతోంది? 14ఏళ్లనాటి పీడకలని మించిన ఘోరకలి జరగబోతోందా? సముద్రగర్భం బద్దలై జపాన్‌ని ముంచేస్తుందా? భవిష్యత్తుని ఊహించే మాంగా బాబా జోస్యం నిజం కాబోతోందా? ఎప్పుడో పాతికేళ్లక్రితం రాసిన పుస్తకం గురించి.. ప్రపంచం ఇప్పుడెందుకు ఇంతలా చర్చించుకుంటోంది?

New Baba Vanga: జూలై 5 జలప్రళయం తప్పదా?  సునామీ ముంచెత్తబోతోందా?
New Baba Vanga

Updated on: Jul 03, 2025 | 10:15 PM

జూలై 5 జలప్రళయం తప్పదా? జపాన్‌ని సునామీ ముంచెత్తబోతోందా? మాంగా బాబా జోస్యంలో నిజమెంత?  జూలై 5 శనివారం ఎంతోదూరంలో లేదు. పనీపాటలేని రాతలని, పనికిమాలిన కూతలని ఎవరూ లైట్‌ తీసుకోవడం లేదు. గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు. కౌంట్‌డౌన్‌ మొదలైందని జపాన్‌ ప్రజలు భయపడుతున్నారు. ఏ సైంటిస్టులో చెప్పలేదు పెద్ద భూకంపమో సునామీనో వస్తుందని. బాబా వాంగాని మరిపించేలా జపాన్‌ మాంగా బాబా చెప్పిన జోస్యం కదిలే పలకలమీదుండే ఆ దేశాన్ని వణికిస్తోంది. జపాన్‌ ప్రజలే కాదు.. ప్రపంచమంతా ఏమో ఆ జోస్యం నిజమవుతుందేమోనని తమ జాగ్రత్తలో తాముంటున్నారు. జూలై 5 డిజాస్టర్ అంటూ ఆన్‌లైన్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. పోయిపోయి అక్కడ సమాధి కావడమెందుకని కొంతమంది ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఆరోజు ప్రయాణాలు కూడా క్యాన్సిల్‌ చేసుకున్నారు. అందరినీ ఇంతలా భయపెడుతోందేంటో తెలుసా.. ద ఫ్యూచర్ ఐసా పేరుతో ర్యో తత్సుకీ రాసిన పుస్తకం. జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్టు తత్సుకీ అప్పుడెప్పుడో చేతిరాతతో రాసిన పుస్తకంలోని జోస్యం జపాన్‌ని షేక్‌చేస్తోంది. ద ఫ్యూచర్‌ ఐసా పేరుతో 1999లో స్వయంగా చేతిరాతతో ఈ పుస్తకాన్ని రాసింది మాంగా బాబా. అందులోనే 2025 జూలై5న ముంచుకొచ్చే విపత్తు గురించి ప్రస్తావించింది. ఊహాజనితంగా రాసిందని కొట్టిపారేయడానికి వీల్లేకుండా ఆ పుస్తకంలో ఆమె రాసిన ఘటనలు కొన్ని నిజంగానే జరిగాయి. ప్రిన్సెస్ డయానా మరణం, 2011 జపాన్ భూకంపం, సునామీ, కొవిడ్‌ మహమ్మారిని ముందే ఊహించింది మాంగా బాబా. అందుకే ఆమె...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి