Japan: చిగురుటాకులా వణికిస్తున్న హినమ్నర్.. పెను తుఫాను ధాటికి కకావికలమవుతున్న జపాన్..

|

Sep 14, 2022 | 7:48 AM

మొన్నటి వరకు చైనా, సౌత్‌ కొరియా, పాకిస్తాన్‌ను వణికించిన వర్షాలు ఇప్పుడు జపాన్‌కు చేరాయి..తూర్పు చైనా సముద్రంలో తాజాగా ఏర్పడిన బలమైన తుఫాను ‘హినమ్నర్‌’.. చైనా, జపాన్‌ తీర ప్రాంతాలను వణికిస్తోంది. చైనా తీర ప్రాంతాలు...

Japan: చిగురుటాకులా వణికిస్తున్న హినమ్నర్.. పెను తుఫాను ధాటికి కకావికలమవుతున్న జపాన్..
Super Typhoon Hinnamnor
Follow us on

మొన్నటి వరకు చైనా, సౌత్‌ కొరియా, పాకిస్తాన్‌ను వణికించిన వర్షాలు ఇప్పుడు జపాన్‌కు చేరాయి..తూర్పు చైనా సముద్రంలో తాజాగా ఏర్పడిన బలమైన తుఫాను ‘హినమ్నర్‌’.. చైనా, జపాన్‌ తీర ప్రాంతాలను వణికిస్తోంది. చైనా తీర ప్రాంతాలు, తైవాన్‌పై ఈ పెను తుఫాను తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. తుఫాను ప్రభావం కారణంగా గంటకు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి..ఒక్కోసారి గాలుల వేగం 296 కిలోమీటర్ల వరకూ వెళ్లుతుందని జపాన్‌ వాతావరణశాఖ హెచ్చిరించింది. ఈ టైఫూన్‌ను 2022లో ప్రపంచంలోనే అత్యంత బలమైన పెను తుఫానుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. 1000మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తినటానికి తిండి, తాగటానికి నీరు లేక ఆకలితో అలమటించిపోతున్నారు. చిన్నపిల్లల కడుపులు కూడా నింపలేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

వరదలతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. లక్షలాది మంది నిలువనీడ లేకుండా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కచ్చి జిల్లాలోని జలాల్‌ ఖాన్‌ గ్రామం పాకిస్థాన్ లో మతసామరస్యానికి వేదిక అయ్యింది. జలాల్‌ ఖాన్‌ గ్రామ ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న బాబా మధోదాస్‌ హిందూ దేవాలయం వారికి ఆశ్రయం కల్పించింది. దేవాలయం నిర్వాహకులు 200ల నుంచి 300 మంది ముస్లింకు ఆశ్రయం కల్పించారు.

జల విలయానికి పాకిస్తాన్‌ తీవ్రంగా నష్టపోయింది. ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తడంతో ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని వరదలు మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ఈ వరదల వల్ల పాకిస్తాన్‌కు 10 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు, బ్రిడ్జిలు, కరెంట్ స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోయాయి. వ్యవసాయ భూములు కొట్టుకుపోయాయి. పాక్ సైన్యంతో పాటు అన్ని అధికారిక డిపార్ట్‌మెంట్ల అధికారులు వరద బాధితులకు సహాయం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..