జనాభా పెంపుకు జపాన్‌ పాట్లు..! దంపతులకు ఏకంగా 5 లక్షల నజరానా ప్రకటన..

|

Dec 14, 2022 | 6:40 AM

జననాల రేటును పెంచేందుకు నజరానా ఇచ్చిమరీ ప్రోత్సహిస్తోంది ఈ దేశ ప్రభుత్వం. ఎక్కువ మంది పిల్లల్ని కనండంటూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బులే వేసి మరి బతిమాలుకుంటోంది. ఇంతకీ ఎక్కడంటే..

జనాభా పెంపుకు జపాన్‌ పాట్లు..! దంపతులకు ఏకంగా 5 లక్షల నజరానా ప్రకటన..
Childbirth And Childcare Grant In Japan
Follow us on

జననాల రేటును పెంచేందుకు నజరానా ఇచ్చిమరీ ప్రోత్సహిస్తోంది ఈ దేశ ప్రభుత్వం. ఎక్కువ మంది పిల్లల్ని కనండంటూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బులే వేసి మరి బతిమాలుకుంటోంది. ఇంతకీ ఎక్కడంటే..

జపాన్‌‌లో గత కొంతకాలంగా జనాభా రేటు ఘనణీయంగా పడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో జనన రేటును పెంచడానికి నూతన దంపతులకు ఆ దేశ శిశు సంక్షేమ శాఖ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద కొత్తగా నమోదైన జననాలకు ఇప్పటి వరకు 4,20,000 యెన్‌ (రూ.2,65,500)లను నజరానాగా ఇస్తోంది. దానిని ఏకంగా 5,00,000 యెన్‌లకు పెంచాలని యోచిస్తోంది. గత వారం జపాన్‌ ప్రధాని ఫుమియో కుషిదాతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. దీనిని వచ్చే ఏడాది (2023) నుంచి అమలు చేయనున్నట్లు జపాన్‌ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

నిజానికి.. పిల్లల్నికనాలనుకునే దంపతులను ప్రోత్సహించేందుకు ఇది పెద్ద నజరానేమీకాదు. ఎందుకంటే జపాన్‌లో ఒక డెలివరీకి ఆ దేశ పౌరులు సగటున రూ.4,73,000యెన్‌లు ఖర్చు చేస్తున్నారు. ఇక డెలివరీ అనంతరం వారు కేవలం 30 వేల యన్‌లు మాత్రమే పొందుకుంటారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జపాన్‌ ప్రజలు పెరిగిన కొద్దిపాటి నజరానా పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2009 తర్వాత శిశు జననాలకు జపాన్‌ ప్రభుత్వం తొలిసారిగా 80 వేల యెన్‌లను పెంచింది మరీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.