మోడీతో మెమోరీస్… భారత్ తో బలమైన బంధం… సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసిన ఇవాంకా ట్రంప్…

|

Dec 01, 2020 | 5:05 PM

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ సోషల్ మీడియాలో డిసెంబర్ 2న ఒక పోస్టును షేర్ చేశారు. అది సరిగ్గా మూడేళ్ల క్రితం భారత పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న ఫొటో.

మోడీతో మెమోరీస్... భారత్ తో బలమైన బంధం... సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసిన ఇవాంకా ట్రంప్...
Follow us on

Ivanka trump shared a insta post అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ సోషల్ మీడియాలో డిసెంబర్ 2న ఒక పోస్టును షేర్ చేశారు. అది సరిగ్గా మూడేళ్ల క్రితం భారత పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న ఫొటో. 2017 నవంబర్ నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరిగింది. ఆ సమావేశానికి ఇవాంకా అమెరికా నుంచి 350 మంది ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించారు.

భారత్ అమెరికా స్నేహ సంబంధం….

ఇవాంకా ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాస్తూ… ‘‘ ప్రపంచం కరోనాతో పోరాడుతున్న సమయంలో అంతర్జాతీయ భద్రత, సుస్థిరత, ఆర్థిక శ్రేయస్సులో భారత్, అమెరికా కు బలమైన స్నేహ సంబంధం ఉంది. అది గతంలో కంటే మరింత మెరుగైంది’’ అని రాశారు.