ఇరాక్-సిరియా బోర్డర్ లో వైమానిక దాడి, ఇరాన్ కమాండర్ హతం, ఇజ్రాయెల్ పనేనా ?

ఇరాక్-సిరియా సరిహద్దుల్లో జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ కమాండర్ సహా నలుగురు మరణించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఈ కమాండర్ ఐడెంటిటీ ఇంకా తెలియలేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వీరి వాహనం..

ఇరాక్-సిరియా బోర్డర్ లో వైమానిక దాడి, ఇరాన్ కమాండర్ హతం, ఇజ్రాయెల్ పనేనా ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 01, 2020 | 4:43 PM

ఇరాక్-సిరియా సరిహద్దుల్లో జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ కమాండర్ సహా నలుగురు మరణించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఈ కమాండర్ ఐడెంటిటీ ఇంకా తెలియలేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వీరి వాహనం ఇరాక్ బోర్డర్ ద్వారా సిరియా భూభాగంలో ప్రవేశించగానే వైమానిక దాడి జరిగిందని, ఈ ఘటనలో వీరి వాహనం తీవ్రంగా దెబ్బ తిన్నదని ఇరాకీ అధికారులు తెలిపారు. ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫక్రీజాదేని టెహ్రాన్ సమీపంలోని అబ్సార్డ్ వద్ద దారుణంగా హతమార్చి రెండు రోజులైందో లేదో ఇరాన్ కమాండర్ పై కూడా ఎటాక్ జరగడం గమనార్హం. తమ అణు పితామహుని మృతికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. పైగా ఈ ఘటన స్థలంలో ఇజ్రాయెల్ లో తయారైన రైఫిళ్లను  కనుగొన్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ పై  ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్ఛరించింది.

ఇరాన్ ఆరోపణపై ఇజ్రాయెల్ స్పందించనప్పటికీ..ఇరాక్-సిరియా సరిహద్దుల్లో వైమానిక దాడులు జరుపుతూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా ఏదో విధంగా దాడులకు పాల్పడుతోంది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక తన అధికారాన్ని వీడబోతున్న తరుణంలో తాము ఇరానియన్ టార్గెట్లపై దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ పట్ల ట్రంప్ కఠిన వైఖరి అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ తన అణుక్షిపణుల ప్రయోగాన్ని నిలిపివేసేంతవరకు తాము ఆ దేశానికి ఎలాంటి ఆయుధ సహాయమూ చేయబోమంటూ ఆయన ‘ఎంబార్గో’ విధించారు. ఈ ఆంక్షలను సడలించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కోరినప్పటికీ ట్రంప్ వెనుకంజ వేయలేదు. ఇక అమెరికా నూతన అధ్యక్షుడు కానున్న జో బైడెన్..ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలపట్ల ఎలాంటి వైఖరి అనుసరిస్తారో చూడాల్సిఉంది.

మధ్యప్రాచ్య దేశాల్లో  ఉద్రిక్తతలు రేగకుండా చూడడానికి ఐరాస ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలమధ్య పాత కక్షలు భగ్గుమంటూనే ఉన్నాయి. సంయమనంతో వ్యవహరించాలని ఐరాస చేస్తున్న అభ్యర్థనలను ఈ దేశాలు పట్టించుకోవడంలేదు.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..