కాశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపడమే ప్రధానలక్ష్యంగా జైష్-ఎ-మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పనిచేస్తోంది . ఈ ఉగ్రవాద సంస్థ కమాండర్ గా వ్యవహరిస్తున్న ముఫ్తీ రౌఫ్ అస్గర్, కాశ్మీర్‌లోని జైష్ ఉగ్రవాదులకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేయడం కష్టంగా మారిందని కాశ్మీర్ లోని ఉగ్రవాదులకు ఒక సందేశం పంపాడు . ముఫ్తీ అస్గర్ గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ తమ్ముడు, తన అన్న అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కారణంగా ఇతడు కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నపుడు.
జమ్మూలోని నాగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఎంకౌంటర్ వెంటనే ముఫ్తీ రౌఫ్ అస్గర్ కాశ్మీర్‌లోని జైష్ కార్యకర్తలకు సందేశం పంపాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో విధ్వంసానికి జైషే మొహ్మద్ తెరదీసింది. అయితే ఆయుధాలు పంపడం చాలా కష్టంగా ఉందని అస్గర్ కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులతో చెప్పారు.అస్గర్ నేతృత్వంలో నాలుగు సార్లు ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. నవంబర్ 19న జరిగిన ఎన్‌కౌంటర్ జైషే మొహ్మద్ సంస్థకు భారీ నష్టాన్ని చేకూర్చింది. భారత్ లోకి ఉగ్రవాదులను పంపేందుకు అస్గర్ భారీగా ఖర్చుపెట్టాడు. వారికీ శిక్షణ కూడా ఇచ్చాడు. భారత్‌లోకి చొరబడేందుకు సరిహద్దులో ఉగ్రవాదులు భారీ సొరంగాన్ని తవ్వారు. ఇందుకోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు బీఎస్‌ఎఫ్ పేర్కొంది. ఈ భారీ సొరంగాన్ని చూసి ఆశ్చర్యానికి గురైంది బీఎస్‌ఎఫ్.
ఇక ఎంకౌంటర్ లో హతమైన ఉగ్రవాదుల నుంచి నుంచి 11 ఏకే 47 రైఫిళ్లు, 3 పిస్తోళ్లు, 29 హ్యాండ్ గ్రెనేడ్లు,6 లాంచర్ గ్రెనేడ్లను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కు వచ్చిన తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు తిరిగి యాక్టివ్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు తమ క్యాడర్‌ను పెంచుకునే పనిలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది.ముజఫరాబాద్ లోని చేలబండి క్యాంప్ నుంచి ఎల్‌ఓసీ వద్ద ఉన్న నీలం వ్యాలీకి క్యాడర్‌ను తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి. భారత్ లోకి చొరబడేందుకు జైషే మొహ్మద్ సంస్థతో పాటు అల్ అల్ బదర్ సంస్థ అనే మరో ఉగ్రవాద సంస్థ కూడా బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఇక ఖైబర్ ఫఖ్తుంక్వాలోని అటవీ ప్రాంతంలో 400 మందికి ఉగ్రవాదంలో హిజ్బుల్ ముజాహీద్దీన్ సంస్థ శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.