One Euro Houses: సొంత ఇల్లు ఉండాలని.. ఎటువంటి బాధలు లేకుండా సొంత ఇంట్లో హ్యాపీగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ దేశ ప్రజలకైనా సొంత ఇల్లు కోసం కలలు కంటారు. పేద, మధ్య తరగతి వారు తమకంటూ సొంత ఇల్లు ఉండలని కోరుకుంటారు. అయితే ప్రస్తుతం సంపాదన తక్కువ.. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతివారికి ఇల్లు అనేది తీరని కోరికగా మిగిలిపోతుంది. ముఖ్యంగా బతుకుదెరువు కోసం గ్రామాలు చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అయితే మళ్ళీ తమ ప్రాంతం ప్రజలతో కలకాలాడాలని కొన్ని ప్రభుత్వాలు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఓ పట్టణంలోని ఇళ్లను కేవలం రూ.90 లకే అమ్మడానికి అక్కడ సర్కార్ రెడీ అయ్యింది. ఈ ఘటన ఇటలీదేశంలో చోటు చేసుకుంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే… వివరాలోకి వెళ్తే..
కాస్టిగ్లియోన్ డీసీసీలియా వద్ద సిసిలియన్ పట్టణంలో అతి తక్కువ ధరకు ఇళ్లను అమ్మకానికి అక్కడ ప్రభుత్వం పెట్టింది. కాస్టిగ్లియోన్ డి సీసీలియా ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది . ఏటవాలు పర్వతం.. సముద్ర తీరం వంటి వాటితో సుందరంగా ఉంటుంది ఈ గ్రామం. ఇక్కడ సుమారు 900 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో చాలావరకూ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. శిధిలావస్థలో ఉన్న ఈ ఇళ్లను 1 యూరోకి(భారత కరెన్సీలో రూ.90లకు) అదే మంచి ఇళ్లను కూడా 4వేల యూరోల నుంచి 5 వేల యూరోలకు అమ్ముతున్నారు. (అంటే మన దేశ కరెన్సీలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 4.5 లక్షలకు అమ్మకానికి పెట్టారు.
అయితే శిలావస్థలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేవారికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇళ్లను ఖరీదు చేసిన యజమానులు మూడేళ్ళ లోపు కొన్న ఇంటికి మరమత్తులు చేయాల్సి ఉంది. ఈ షరత్తుకు అంగీకరిస్తేనే ఒక యురోకి ఇళ్లను అమ్ముతున్నారు. చారిత్రాత్మక ప్రాంతమైన ఇక్కడ ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ ను కాపాడాలంటూ.. నగర్ మేయర్ ఆంటోనినో కమర్డా పిలుపునిచ్చారు. 1930లో ఈ గ్రామంలో 2,500 మంది ఉండే ఇక్కడ నివసిస్తున్న జనాభా తగ్గిపోతూ వస్తుంది. అయితే ఇటలీలో దేశంలో గ్రామాలను కాపాడుకోవడానికి.. పల్లెలు జనాభాతో కలకాలాడడానికి ఇలా తక్కువ ధరకు ఇళ్లను అమ్మడం ఇదే మొదటిసారి కాదు.. ఇప్పటికే సలేమి, బిసక్సియా వంటి ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే ఇల్లు అమ్మకానికి పెట్టారు కూడా..
Town in Sicily, Castiglione di Sicilia in Italy is selling houses for just ONE Euro ($1.21 U.S, 87p); buyers must complete any renovation works planned within 3 years https://t.co/eGNQilp8eD
— miss waiching liu (@mswaichingliu81) April 26, 2021