Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే బీర్‌ ఫ్రీ.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన పబ్‌ నిర్వాహకులు

|

Feb 19, 2021 | 9:30 PM

Corona Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనుసాగుతోంది. దాదాపు ఏడాదిగా ప్రపంచ దేశాలను సైతం ముప్పుతిప్పులు పెట్టిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు ...

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే బీర్‌ ఫ్రీ.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన పబ్‌ నిర్వాహకులు
Follow us on

Corona Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనుసాగుతోంది. దాదాపు ఏడాదిగా ప్రపంచ దేశాలను సైతం ముప్పుతిప్పులు పెట్టిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక డిసెంబర్‌ 20న కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించిన ఇజ్రాయెల్‌ వేగంగా దూసుకెళ్తోంది. 93 లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు 47 శాతం మంది పైజర్‌ టీకా తొలి డోసును, 31 శాతం మంది రెండో డోసులను తీసుకున్నారని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

దేశంలోని 70ఏళ్లకు పైబడిన వారిలో 90 శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని వివరించారు. అయితే పైజర్‌ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలే ఇస్తుందని పేర్కొన్నారు. కాగా, వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ అందించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అయితే వ్యాక్సినేషన్‌ సందర్భంగా టెల్‌ అవివ్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జెనియా గ్యాస్ట్రో పబ్‌ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ ప్రకటించింది. మొదటి, రెండు టీకాలు తీసుకున్న వారికి ఒక బీర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్‌ నిబంధనల మేరకు ఆల్కహాల్‌ లేని డ్రింకులను అందిస్తున్నట్లు పబ్‌ నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకునే చోటుకు మనం వెళ్లలేకపోయినప్పుడు మన వెళ్లే చోటుకే వ్యాక్సిన్‌ను తీసుకురావడమన్నది మంచి ఆలోచన అని అన్నారు.

 


Also Read:

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కీలక నిర్ణయం.. 17 ఏళ్ల ఆ ఇంటి బంధాన్ని తెంచుకోనున్న వైనం

Vaccination: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్.. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్‌..