AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel PM: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తుంది.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.

Israel PM: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తుంది.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన
Israel Pm Benjamin Netanyahu
Balaraju Goud
|

Updated on: Oct 18, 2024 | 1:11 PM

Share

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 17న తన ప్రసంగంలో, హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని రేపటితోనే ముగిస్తానని, అయితే దీని కోసం హమాస్ తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, హమాస్ ఇజ్రాయెల్ షరతులను అంగీకరిస్తుందా లేదా అనేది చూడటం నిజంగా ఆసక్తికరంగా మారింది. సమాచారం ప్రకారం, కనీసం 102 మంది ఇప్పటికీ హమాస్ అదుపులో ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

బెంజమిన్ నెతన్యాహు తన వీడియో సందేశంలో, గాజా ప్రజలకు ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. సింహంగా భావించే సిన్వార్ స్వయంగా డెన్‌లో దాక్కున్నాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బృందం జరిపిన దాడిలో సిన్వార్ హతమయ్యారన్నారు. ఉగ్రవాద పాలనకు త్వరలో ముగింపు పలుకుతామన్నారు.

గాజాలో వైమానిక దాడిలో మరణించిన ముగ్గురిలో సిన్వార్ కూడా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గురువారం ధృవీకరించింది. దంత రికార్డులు, వేలిముద్రలు, సైట్ నుండి స్వాధీనం చేసుకున్న శరీరంపై DNA పరీక్షలను పోల్చిన తర్వాత సిన్వార్ మరణం నిర్ధారించారు. సిన్వార్ హత్యకు దారితీసిన ఆపరేషన్ IDF పదాతిదళ సైనికులు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను భవనాల మధ్య కదులుతున్నట్లు గుర్తించి కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో యాహ్యా సిన్వార్ శిథిలమైన భవనంలోకి తప్పించుకోగలిగాడు. అక్కడ ఒక IDF డ్రోన్ అతనిని ట్రాక్ చేసింది. చివరికి సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైనికులు టార్గెట్ చేసి హతమార్చారు.

వీడియో చూడండి..

ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సిన్వార్. కనీసం డజను మంది పాలస్తీనియన్లను హింసించి చంపినందున యాహ్యా సిన్వార్‌ను ‘ఖాన్ యూనిస్ కసాయి’ అని పిలుస్తారు. ఇరాన్ నిర్మించిన టెర్రర్ వృక్షం కూలిపోతోంది. నస్రల్లా (హిజ్బుల్లా చీఫ్) పోయాడు. అతని డిప్యూటీ మొహసేన్ పోయాడు. హనీయే (ఇస్మాయిల్) పోయాడు. మహ్మద్ దీఫ్ (హమాస్ మిలిటరీ చీఫ్) మరణించాడు. ఉగ్రవాద పాలన ఆ ఇరాన్ పాలన అని, దాని స్వంత ప్రజలపై, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ ప్రజలపై విధించిన అంక్షలకు విముక్తి కలుగుతుందని, ఉగ్రవాదం పూర్తిగా అంతం అవుతుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

యాహ్యా సిన్వార్ హత్యను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా ఇతర ఇజ్రాయెల్ నాయకులను అభినందించారు. బందీలను ఇంటికి తీసుకురావడానికి, యుద్ధాన్ని ముగించే మార్గాన్ని చర్చించడానికి త్వరలో మాట్లాడతానని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. సిన్వర్ మృతిపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ సైతం స్పందించారు. సిన్వార్ మరణంతో న్యాయం జరిగిందన్నారు. దీంతో గాజాతో యుద్ధం ముగింపు పలికేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నామన్నారు. ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడంతోపాటు గాజాలో బాధలు తొలగిపోతాయని కమలా హారిస్ పేర్కొన్నారు.

కాగా, అక్టోబరు 7న జరిగిన తీవ్రవాద దాడులు, అనాగరిక చర్యలకు యాహ్యా సిన్వార్ ప్రధాన సూత్రధారి అని ఐడిఎఫ్ తెలిపింది. 1,200 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. హమాస్ చేతిలో ఇప్పటికీ ఉన్న బందీలందరినీ విడుదల చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ డిమాండ్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..