అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం.. నోబెల్‌ శాస్త్రవేత్తల సరసన హేమచంద్రారెడ్డికి చోటు

|

Dec 25, 2020 | 7:44 PM

అమెరికాలోని నోబెల్‌ సైంటిస్టుల క్లబ్‌లో తెలుగు వ్యక్తికి అరుదై గౌరవం దక్కింది. తిరుపతి రూరల్‌ మల్లంగుంటకు చెందిన పార్లపల్లె హేమచంద్రారెడ్డి అమెరికాలోని నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో చోటు సంపాదించుకున్నారు.

అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం.. నోబెల్‌ శాస్త్రవేత్తల సరసన హేమచంద్రారెడ్డికి చోటు
Follow us on

అమెరికాలోని నోబెల్‌ సైంటిస్టుల క్లబ్‌లో తెలుగు వ్యక్తికి అరుదై గౌరవం దక్కింది. తిరుపతి రూరల్‌ మల్లంగుంటకు చెందిన పార్లపల్లె హేమచంద్రారెడ్డి అమెరికాలోని నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో చోటు సంపాదించుకున్నారు. 1981-83లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజికల్‌ ఆంత్రోపాలజీ అండ్‌ ప్రి-హిస్టారిక్‌ ఆర్కియాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి అమెరికాలో సిద్ధపడ్డారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌మెంట్‌ సైన్సెస్‌లో ఫెలోగా నియమితులయ్యారు. నోబెల్‌ అవార్డు అందుకున్న, అందుకోనున్న శాస్త్రవేత్తలు ఈ సంస్థలో ఉంటారు. వృద్ధాప్యంలో మతిమరుపు ఎలా వస్తుందనే అంశంపై హేమచంద్రారెడ్డి విస్తృతంగా పరిశోధనలు జరిపారు. దీంతో ఆయనను నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇది గొప్ప శాస్త్రవేత్తలకు మాత్రమే లభించే గౌరవం. నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్న, అందుకోనున్న శాస్త్రవేత్తలు ఈ సంస్థలో ఉంటారు. ఇంతటి గుర్తింపు పొందిన హేమచంద్రారెడ్డికి గౌరవ సూచకంగా ఆయన తల్లి పార్లపల్లె రాజమ్మను మల్లంగుంటలో గురువారం స్థానికులు ఘనంగా సన్మానించారు.