International Yoga Day 2023: ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. అన్ని దేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

|

Jun 21, 2023 | 1:02 PM

International Yoga Day 2023: ప్రపంచమంతా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటోంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు.

International Yoga Day 2023: ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. అన్ని దేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..
Yoga Day
Follow us on

International Yoga Day 2023: ప్రపంచమంతా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటోంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు దేశాల్లో సైతం యోగా దినోత్సవానికి ఆయా దేశాలు ఏర్పాట్లు చేశాయి. ఇటు దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్‌ యోగా దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. అంతా యోగా డేను జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. పార్కుల్లో.. పలు స్టేడియాల్లో యోగా దినోత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాగా, ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొంది. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా అని తెలిపింది.

భారత ప్రభుత్వం 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోడీ తీసుకున్న చొరవతో ఐక్యరాజ్యసమితి (UNO) అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది. అయితే, ఈ తేదికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21 ప్రత్యేకత అని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..