విచిత్రమైన, అధిక శరీర భాగాలతో పుట్టిన పిల్లల గురించి తరచుగా వినడం లేదా చూడటం జరుగుతుంది. సాధారణంగా అలాంటి పిల్లలు ఎక్కువ కాలం జీవించరు. అయినప్పటికీ ఆ చిన్నారుల శారీరక నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి విచిత్ర శిశువులను చూసి కలియుగంలో వింతలు అని కూడా వ్యాఖ్యానిస్తారు. అయితే ఇప్పటి వరకూ ప్రపంచంలో పొడవైన వ్యక్తి, పొట్టి వ్యక్తి బరువు అంటూ రకరకాల మనుషుల గురించి విన్నారు.. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తి ఉన్నారని మీకు తెలుసా? ఆ వ్యక్తి పేరు చరిత్ర పుటలలో నమోదు చేయబడింది.. అంతేకాదు బహుశా ఈ రికార్డ్ ను ఎవరూ బీట్ చేయలేరంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత పెద్ద ముక్కు బహుశా ఏ నరమానవుడి ఉండదు. అతని ముక్కు ఎంత పెద్దదిగా ఉంటుందో ఊహకు కూడా అందదని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తి పేరు థామస్ వెడ్డర్స్. ఇతనిని థామస్ వాడ్‌హౌస్ అని కూడా పిలుస్తారు. అయితే థామస్ 250 సంవత్సరాల క్రితం పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డ్ ను ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు సరికదా ఆ రికార్డ్ సమీపంలోకి కూడా చేరుకోలేకపోయారు. బ్రిటన్‌లో నివసించిన ఈ వ్యక్తి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
ముక్కు 7.5 అంగుళాల పొడవు:
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ వ్యక్తి ముక్కు 7.5 అంగుళాలు (19 సెం.మీ.) పొడవు ఉంది. 1770 సంవత్సరంలో అతను ఇంగ్లాండ్‌లో నివసించాడు. సర్కస్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ఈ వింత వ్యక్తి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Thomas Wadhouse was an English circus performer who lived in the 18th century. He is most famously known for having the world’s longest nose, which measured 7.5 inches (19 cm) long. pic.twitter.com/Gx3cRsGXxd
— Historic Vids (@historyinmemes) November 12, 2022
నిజానికి, మ్యూజియంలో ఉంచిన మైనపు దిష్టిబొమ్మ అయిన @historyinmemes అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఇటీవల ఒక చిత్రం షేర్ చేశారు. ఆ ఫోటో థామస్ వెడ్డర్స్ . అతని ముక్కు ఎంత పెద్దదో చిత్రంలో మీరు చూడవచ్చు. ఈ చిత్రానికి ఇప్పటివరకు ఒక లక్షా 20 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు 7 వేల మందికి పైగా ప్రజలు పోస్ట్‌ను రీట్వీట్ చేసారు. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ ను చేశారు.
ఈ వ్యక్తిని ముక్కు పొడవు విషయంలో ఎవరూ బీట్ చేయలేరని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘ఈ మనిషి మంత్రగాళ్ల ఊరిలో పుట్టాడా?’ అని కొందరు సరదాగా అడుగుతున్నారు. అదే సమయంలో, ‘కరోనా ఆ సమయంలో వచ్చి ఉంటే, ఈ వ్యక్తి ఏమి చేసి ఉండేవాడు, ఒక్కసారి ఆలోచించండి’ అని మరొకరు తన సందేహాన్ని వ్యక్తం చేశారు..
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..