నక్క తోక తొక్కాడు. ఎక్కడో తంతే..బూరేల బుట్టలో పడ్డాడు.. ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం. ఇవన్నీ ఎవరికైనా అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టాన్ని ఇలా వర్ణిస్తుంటారు. అయితే, ఇక్కడో భారతీయుడు దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టాడు. దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌లో అతని పంటపడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని కాన్‌కోర్స్ ఎలో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అతడు రూ. 8.20కోట్లు గెలుచుకున్నాడు. జులై 19 బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో అతడు ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. జూన్ 30వ తారీఖున ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 3588కు జాక్‌పాట్ తగిలింది.
టికెట్ విజేత ముంబైకి చెందిన వినయ్ శ్రీకర్.. జూన్ 30న దుబాయి నుంచి సౌదీ అరేబియాలోని తబుక్ వెళ్తుండగా ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలోనే అతడు ఏదో సరదాగా ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడట.. కానీ, అదే టికెట్.. అతడి జీవితాన్ని మార్చేసింది. ఒకే ఒక్క టికెట్ అతనికి కోట్లు తెచ్చిపెట్టింది.
అతను 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌ను ప్రారంభించినప్పటి నుండి $1 మిలియన్ గెలుచుకున్న 212వ భారతీయ జాతీయుడు. దుబాయ్‌లో జాతీయులు ఇలాంటి లాటరీ టిక్కెట్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..