AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. పక్క దేశంలోనూ పరువు తీస్తున్నారు.. భారతీయ వ్యక్తిని బహిష్కరించిన కెనడా.. ఎందుకంటే?

తన మనవడిని చూసేందుకు ఆరు నెలల విజిటింగ్ వీసాపై కెనడాకు వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి ఆదేశ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వ్యక్తి కెనడా నుంచి బహిష్కరిస్తూ.. మరోసారి వాళ్ల దేశానికి రాకుండా అతని ప్రవేశాన్ని నిషేధించింది. ఇంతకు కోర్టు అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే.. మీరు షాక్ అవుతారు.

ఛీ.. ఛీ.. పక్క దేశంలోనూ పరువు తీస్తున్నారు.. భారతీయ వ్యక్తిని బహిష్కరించిన కెనడా.. ఎందుకంటే?
Indian Man Banned From Cana
Anand T
|

Updated on: Nov 24, 2025 | 11:19 AM

Share

ఇతర దేశాలకు వెళ్లిన కొందరు వ్యక్తులు.. అక్కడ చేయరాని పనులు చేసిన మన దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది..ఆరు నెలల విజిటర్ వీసాపై కెనడాకు వెళ్లిన 51 ఏళ్ల భారతీయ వ్యక్తి, ఓ స్కూల్‌ ముందు ఇద్దరు టీనేజ్ బాలికలను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతన్ని కెనడా నుంచి బహిష్కరిస్తూ తీర్పు ఇచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్ కెనడాలోని ఒంటారియోలో ఉంటున్న తన మనవడి దగ్గరికి వెళ్లిన తర్వాత.. తను ఉంటున్న సర్నియా ప్రాంతంలోని స్థానిక ఉన్నత పాఠశాల పక్కనున్న ఒక కొట్టు దగ్గరకు వెళ్లి తరచూ సిగరెట్‌ కాల్చుతుండేవాడు.. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కెనడియన్ బాలికలు, యువతులపై వేధింపులకు పాల్పడేవాడని. వారి వెంట పడుతూ ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తూ.. వారితో డ్రగ్స్, మద్యం గురించి మాట్లాడేవారని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి.

దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 16న లైంగిక వేధింపుల ఆరోపణలతో సింగ్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే రెండ్రోజు తర్వాత సింగ్‌ మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చాడు.. కానీ అదే రోజు అతన్ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తర్వాత అతన్ని మళ్లీ కోర్టులో హాజరుపర్చగా.. ఈ రకమైన ప్రవర్తనను సహించమని జస్టిస్ క్రిస్టా లిన్ లెస్జ్జిన్స్కీ పేర్కొన్నారు. డిసెంబర్ 30న భారతదేశానికి తిరిగి రావడానికి అతనికి టికెట్ ఉందని సింగ్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై స్పందిస్తూ సింగ్‌ను దేశం నుండి బహిష్కరించాలని, కెనడాలోకి మరోసారి రాకుండా అతని ప్రవేశాన్ని నిషేధించాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!