అద్భుతం.. ఆకాశం నుంచి బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ..
మనం అంతరిక్షం, విశ్వం, గ్రహాల గురించి మాట్లాడేటప్పుడు పాలపుంత చిత్రం మన మనస్సులలో మెరుస్తుంది. అయితే గ్రహాలతో పాటు, లక్షలాది ఉల్కలు, గ్రహశకలాలు కూడా అంతరిక్షంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నాయి. మిలియన్ల సంవత్సరాల క్రితం అలాంటి ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టి, డైనోసార్లను తుడిచిపెట్టింది. కానీ, ఒక ఉల్కాపాతం దాడికి గురైన ఒక మహిళ గురించి మీకు తెలుసా..? అవును, నమ్మడం కష్టమే. కానీ, అలాంటి సంఘటన ఒకటి జరిగిందని చరిత్రలో ఉంది. ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం..

భూమిని ఒక ఉల్క ఢీకొట్టిన తర్వాత డైనోసార్‌లు తుడిచిపెట్టుకుపోగా, నవంబర్ 30, 1954 మధ్యాహ్న సమయంలో ఆ ఉల్కా ఆన్ ఎలిజబెత్ హోడ్జెస్ అనే మహిళపై పడింది. కానీ, ఆమెకు ఎటువంటి హాని జరగలేదు. ఆ సమయంలో అమెరికాలోని అలబామాలోని సిలాకాగా అనే చిన్న పట్టణంలో ఆన్ ఎలిజబెత్ హోడ్జెస్ తన అద్దె ఇంట్లో సోఫాలో విశ్రాంతి తీసుకుంటోంది. అకస్మాత్తుగా 4 కిలోల బరువున్న ఒక ఉల్క ఆకాశం నుండి కిందకు పడింది. మెరుపులా ఆమె ఉంటున్న ఇంటి పైకప్పును చీల్చుకుంటూ రేడియోను ఢీకొట్టి నేరుగా ఆన్ తుంటిపై పడింది. షాకింగ్ ఉంది కదా..? కానీ, ఈ సంఘటన తర్వాత ఆన్ భూమిపై ఉల్క ఢీకొట్టిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఈ సంఘటన శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. ఉల్కాపాతం ఆన్ ఇంటి పైకప్పును ఢీకొన్నప్పుడు, ఆ శబ్ధానికి ఆమె ఇరుగు పొరుగువారు భయంతో వణికిపోయారు. ఉల్కా ప్రభావంతో ఇంటి పైకప్పులో పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ వార్త దావానంలా వ్యాపించింది. నగరంలోని ప్రతి ఒక్కరూ ఆన్ ఇంటి ముందు గుమిగూడారు. కొందరు దీనిని ఒక అద్భుతం అని భావించగా, మరికొందరు ఇదేదో దయ్యం రాకకు సంకేతంగా భావించారు. అయితే ఉల్క ఢీకొట్టినప్పటికీ ఆన్ ప్రాణాలతో బయటపడింది. ఆమె తుంటిపై ఉన్న మచ్చను ఫోటోల ద్వారా చూడవచ్చు. ఇంటర్‌నెట్‌లో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఉల్క కారణంగా ఆన్ కు ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. కానీ, అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. ఆ ఉల్క కోసం ఇంటి యజమాని సహా స్థానిక పరిపాలన విభాగం మధ్య చట్టపరమైన పోరాటం జరిగింది. చివరకు, సుదీర్ఘ పోరాటం తర్వాత, ఆన్ ఆ ఉల్కను అలబామా మ్యూజియంకు విరాళంగా ఇచ్చింది. ఇది నేటికీ హోడ్జెస్ మెటోరైట్ అనే పేరుతో అక్కడే ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




