AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeans History: అప్పుడు కార్మికులు యూనిఫాం.. ఇప్పుడు అదే ఫ్యాషన్ ట్రెండ్.. జీన్స్ వెనక ఇంత కథ ఉందా.!

జీన్స్.. ప్రస్తుతం యూత్‌లో ఇదొక ట్రెండి ఫ్యాషన్ వేర్.. ప్రతి ఒక్కరూ ఈ జీన్స్ ధరించేందుకు ఎంతగానో ఇష్టపడుతున్నారు. స్టైలిష్‌గా కనిపించేందుకు రకరకాల జీన్స్‌ వేస్తున్నారు. విమియోగదారుల అభిరుచులకు తగ్గట్టూ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న జీన్స్‌.. ఒకప్పుడు కార్మికులు మాత్రమే ధరించేవారని మీకు తెలుసా?.. అవును అప్పల్లో కార్మికులు మాత్రమే ధరించే ఈ జీన్స్‌కు ఇప్పుడు ఇంత డిమాండ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి.

Jeans History: అప్పుడు కార్మికులు యూనిఫాం.. ఇప్పుడు అదే ఫ్యాషన్  ట్రెండ్.. జీన్స్ వెనక ఇంత కథ ఉందా.!
Jeans History
Anand T
|

Updated on: Nov 24, 2025 | 12:42 PM

Share

ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పార్టీలో ఉన్నా, పురుషులు అయినా, స్త్రీలు అయినా, బట్టలు ఎంచుకునేటప్పుడు ఫస్ట్‌గా అందరికి గుర్తుచ్చేది.. జీన్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టపడుతారు. ఒక వ్యక్తి వేసుకొని బట్టల బ్రాండ్‌ను బట్టి.. ఈ కాలంలో ఆవ్యక్తి స్టేటస్‌ను అంచనా వేస్తున్నారు జనాలు. జీన్స్ ఎవరికైనా ట్రెండీ,స్టైలిష్ లుక్ ఇస్తుంది. కానీ ఈ జీన్స్‌కు ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు కేవలం కార్మికుతు మాత్రమే ధరించే ఈ జీన్స్‌.. ప్రజల్లో ఇంత ఆధరణ ఎలా సంపాధించింది.

జీన్స్ ఆసక్తికరమైన చరిత్ర

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌ వేర్‌లో ఉన్న డెనిమ్ వంటి జీన్స్‌ను.. మొదట ధనవంతులు కాదు.. కార్మికులు ధరించే వారు.. వీటిని వారి కోసమ ప్రత్యేకంగా తయారు చేసేవారు. 1873లో, దర్జీ అయిన జాకబ్ డేవిస్, శాన్ ఫ్రాన్సిస్కో టోకు వ్యాపారి లెవి స్ట్రాస్ వాటిని రూపొందించాడు కార్మికులు.. వీరు నిరంతరం మిషన్‌లు వంటి వాటి మధ్యలో పనిచేస్తారు. వీరు పని చేసటప్పుడు, పనికి వెళ్లేప్పుడు.. తమ పనిముట్లను తమ బట్టల లోపల ఉంచుకోవడం చేసేవారు.. ఈ క్రమంలో అవి సులభంగా చిరిగిపోయేవి. కాబట్టి కార్మికుల కోసం మన్నికైన, చిరిగిపోకుండా ఉండే బలమైన దుస్తులు అవసరమని వారు గమనించారు. కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, లెవీ యజమాని బలమైన క్లాత్‌లో ఈ జీన్స్‌ను రూపొందించాడు. అయితే జీన్స్ కార్మికుల కోసం తయారు చేశారు కాబట్టి.. ఆ యజమాని వాటిని ఎప్పుడూ ధరించలేదు.

మహిళల జీన్స్ చరిత్ర

కార్మికుల జీన్స్ తర్వాత.. 1934లో మొదటి సారిగా మహిళలు ధరించే జీన్స్‌ను కూడా ప్రవేశపెట్టారు. వీటి గురించి విస్త్రృతంగా ప్రచారం చేశారు. వాటి ప్రత్యేక లక్షణం ఫ్రంట్ జిప్, దీనిని చాలా మంది పురుషులు తిరస్కరించారు.ఈ జీన్స్ డిజైన్ తగదని కొందరు వాదించారు. అయితే దీనిపై అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, లెవీస్ మహిళల జీన్స్‌ను ఉత్పత్తి చేయడం కొనసాగించింది. కాలక్రమేణా, ఈ డిజైన్ చాలా ప్రజాదరణ పొందింది, దీనిని ప్యాంటులో కూడా ఉపయోగించారు.

ట్రెండింగ్‌లోకి జీన్స్

కాలక్రమేనా ఈ జీన్స్‌కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతున్న కాలానుగానంగా.. వీటిలో స్ట్రైల్స్‌ను కూడా తయారీ దారులు మార్చుతూ వచ్చారు. ఇలా ఎప్పటికప్పుడూ ఇవి వినియోగదారుల అభిరుచులుగా అనుగునంగా కంపెనీలు కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేవి. దీంతో ప్రస్తుతం ఇవి ట్రెండీ, ఫ్యాషన్ వేర్‌గా మారిపోయాయి.ఈ నీలిరంగు లెవీస్ జీన్స్ తయారు చేయడానికి ఇండిగోను ఉపయోగిస్తారు. మొదట్లో జీన్స్ వెనుక ఉండే కంపెనీ లోగో ప్యాచ్‌ను తోలుతో తయారు చేసేవారు కానీ కాలక్రమేణా, ఖర్చును తగ్గించడానికి, దీనిని ఇతర పదార్థాలతో తయారు చేయడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!