Viral Video: నీటి అడుగున ఏదో అలజడి.. దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో.!
నీటి అడుగున చిత్ర విచిత్రమైన జల చరాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనిషి మనుగడకు అంతు చిక్కవు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి మరి.

సముద్ర గర్భంలో మానవ మనుగడకు, సైన్స్‌కు అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఒడ్డుకు కనిపించే జలచరాలు.. చేపలు, తిమింగలాలు, సొరచేపలు, జెల్లీ ఫిష్‌లు లాంటివి అయితే.. కనిపించనివి చాలానే ఉన్నాయి. ఆ కోవకు చెందిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి వీడియో గురించి మాట్లాడుకుందాం. కొందరు వ్యక్తులు పడవపై సరస్సులో చేపల వేటకు వెళ్లగా.. వాళ్లకు నీటి అడుగున ఓ భారీ ఆకారం కనిపించింది. అట్లాంటి.. ఇట్లాంటిది కాదు. ఆ పడవ పక్క నుంచి అది వెళ్తూ.. సడన్‌గా నీటి అడుగునకు వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కొందరు తీయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1960 కాలంలో నాసా.. సముద్రగర్భంలోని జీవుల గురించి అన్వేషించగా.. ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.
కొందరు ఈ వీడియోపై కామెంట్ చేస్తూ.. అది భూమిపై ఉన్న భారీ పాము టైటానోబోవా అని కొందరు.. లేదు ఓ రకమైన జాతికి చెందిన చేప అని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే ఇది వైట్ స్టర్జన్ అని అన్నారు. టైటానోబోవా ఇప్పటికే అంతరించిపోయిందని.. అది స్టర్జన్ ఫిష్ అయి ఉండొచ్చునని పేర్కొన్నారు. మొసలి లాంటి ఆకారంతో కూడిన ఈ పెద్ద చేప 150 సంవత్సరాలు వరకు బతుకుతుంది. అలాగే దీని బరువు సుమారు ఒక టన్ను ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 200 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికి ఉన్న ఈ పురాతన జీవులు.. కెనడాలోని నదులు, సరస్సులు, తీరప్రాంత జలాల్లో ఎక్కువగా కనిపిస్తాయని సమాచారం. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
