Vivek Ramaswamy vs Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయులు.. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య వాగ్వాదం..

|

Aug 25, 2023 | 11:19 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి.. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, ర్యాలీలు, డిబేట్లతో ఆయన తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా జరిగిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లోనూ ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎనిమిది మంది రిపబ్లికన్ అభ్యర్ధులు విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో రెండు గంటల పాటు తలపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్, వాతావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యలతో వివేక్ చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామి తన వాగ్ధాటితో ప్రత్యర్ధులను సులభంగా..

Vivek Ramaswamy vs Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయులు.. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య వాగ్వాదం..
Vivek Ramaswamy Vs Nikki Haley
Follow us on

రిపబ్లికన్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ‍ప్రథమం. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి మధ్య ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది.

ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్‌ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్‌ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్‌ రామస్వామి అన్నారు. అయితే, పుతిన్‌ ఒక హంతకుడని, అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు.

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి.. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, ర్యాలీలు, డిబేట్లతో ఆయన తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా జరిగిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లోనూ ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎనిమిది మంది రిపబ్లికన్ అభ్యర్ధులు విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో రెండు గంటల పాటు తలపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్, వాతావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యలతో వివేక్ చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామి తన వాగ్ధాటితో ప్రత్యర్ధులను సులభంగా కట్టడి చేస్తున్నారు. రామస్వామి ప్రసంగిస్తున్నంతసేపు ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొడుతూ ఆడిటోరియాన్ని మార్మోగించారు. నిక్కీహేలీ, మైక్ పెన్స్ వంటి బలమైన రిపబ్లికన్ నేతలను ఎదుర్కొంటూనే వివేక్ తన స్థానాన్ని మెరుగుపరచుకున్నాడు.

మొత్తంగా రిపబ్లికన్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది.ఇక సెకండ్ రౌండ్ డిబేట్‌ను సెప్టెంబర్ 27న కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో నిర్వహించనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..