ఆ ప్రాంతం భారత్‌దే.. ఒక ఫోటోతో చైనా – పాకిస్తాన్‌లకు చెమటలు పట్టించిన అమెరికా..!

భారతదేశం - అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం (ఫిబ్రవరి 07) ప్రకటించారు. రెండు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం ముసాయిదా ప్రకటనతో, మరొక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ కొత్త మ్యాప్ పాకిస్తాన్‌ తోపాటు చైనాను కలవరపెట్టింది.

ఆ ప్రాంతం భారత్‌దే.. ఒక ఫోటోతో చైనా - పాకిస్తాన్‌లకు చెమటలు పట్టించిన అమెరికా..!
India Map

Updated on: Feb 07, 2026 | 2:48 PM

భారతదేశం – అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం (ఫిబ్రవరి 07) ప్రకటించారు. రెండు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం ముసాయిదా ప్రకటనతో, మరొక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ కొత్త మ్యాప్ పాకిస్తాన్‌ తోపాటు చైనాను కలవరపెట్టింది. ఇది కొత్త అంతర్జాతీయ చర్చకు దారితీసింది. వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన పటంలో జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), అక్సాయ్ చిన్ అన్నీ భారతదేశంలో భాగంగా చూపించింది.

జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దానికి ఎలాంటి బాహ్య అనుమతి అవసరం లేదని భారతదేశం ఎల్లప్పుడూ వాదిస్తుంది. తాజాగా అమెరికా అటువంటి మ్యాప్‌ను విడుదల చేయడం పాకిస్తాన్‌కు పెద్ద రాజకీయ, దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) విడుదల చేసిన పత్రంలో ఉన్న భారతదేశ పటం నిశ్శబ్దంగా పాకిస్తాన్ – చైనా రెండింటినీ నిరుత్సాహపరిచింది. భారతీయుల ముఖంలో అనందాన్ని నింపింది.

ఇప్పటివరకు, అమెరికా విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు కోపం తెప్పించకుండా ఉండటానికి PoKని చుక్కల రేఖగా లేదా వివాదాస్పద ప్రాంతంగా చిత్రీకరించే మ్యాప్‌లను తరచుగా విడుదల చేసేవి. కానీ ఈసారి, ఎటువంటి మలుపులు లేవు, జమ్మూ కాశ్మీర్ అంతా భారతదేశంలోని ఒక భాగంగా చూపింది. ఈ మ్యాప్‌లో అక్సాయ్ చిన్‌ను భారతదేశంలో భాగంగా చిత్రీకరించడం ద్వారా చైనాకు కంటి మీద కునుకు లేకురండా చేసింది. ఇదిలావుంటే చైనా చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని తమదిగా క్లెయిమ్ చేస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి సరిహద్దుల తప్పు చిత్రణపై అమెరికా, అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం పదేపదే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి, అమెరికా భారతదేశం మాట విన్నట్లు కనిపిస్తోంది.

ఈ మొత్తం పరిణామం జరిగిన సమయం కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. ఇటీవలి నెలల్లో భారత్-అమెరికా సంబంధాలు అంత సులభం కాలేదు. ట్రంప్ భారతదేశంపై 50% వరకు సుంకాలను విధించారు.. ఇది అమెరికా మిత్రదేశాలలో అత్యధికం. ఇప్పుడు, మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం, వీటిని 18%కి తగ్గించారు. ఇది ఆసియాలో అత్యల్పమని చెబుతున్నారు. ఇంతలో, ట్రంప్ భారతదేశం-పాకిస్తాన్ విభజనను మళ్ళీ హైఫన్ చేశారని ఆరోపించారు. అటువంటి వాతావరణంలో, ఈ మ్యాప్ భారతదేశానికి ఉపశమనం కలిగించడమే కాకుండా నిశ్శబ్ద విజయంగా కూడా మారుతుంది. ఇదిలావుంటే, ఈ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం భారతదేశానికి ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్స్, ఆటో వంటి రంగాలలో ఉపశమనం కలిగించింది. వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి సున్నితమైన అంశాలపై భారతదేశ ప్రయోజనాలు పూర్తిగా రక్షించినట్లు అయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..