
భారతదేశం–బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఈ అగ్రిమెంట్ ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంగా ఉభయ దేశాలు ముందడుగు వేశాయి. గురువారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్ జోనథన్ రేనోల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ చారిత్రక ఒప్పందానికి ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్‌లు ప్రత్యక్ష సాక్షులయ్యారు.
Congratulations to Prime Minister @NarendraModi ji, UK Prime Minister @Keir_Starmer, and the people of India & the United Kingdom on the signing of the landmark India-UK Comprehensive Economic and Trade Agreement (CETA).
Duty-free access for about 99% of Indian exports unlocks… pic.twitter.com/AWAwVTwtrg
— Piyush Goyal (@PiyushGoyal) July 24, 2025
ఈ ఒప్పందం వల్ల రైతులకు ఎంతో లాభం…
ఈ బప్పందం వల్ల రైతులకు చాలా లాభాలు చేకూరనున్నాయి. బ్రిటన్ మార్కెట్‌కి భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల (పండ్లు, కూరగాయలు, మసాలాలు, ధాన్యాలు) ఎగుమతులకు అధిక అవకాశం ఉంటుంది. ఆర్గానిక్ ఉత్పత్తులపై బ్రిటన్ వినియోగదారుల్లో ఆసక్తి ఎక్కువ ఉండటం వల్ల.. ఆ పంటలు పండించే మన రైతులకు ఎక్కువ ధరలు లభించే అవకాశం ఉంటుంది. ఎగుమతులపై సుంకాల్లో తగ్గింపు వల్ల మధ్యవర్తులు తగ్గి రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది. భారత రైతులకు గ్లోబల్ మార్కెట్ చేరువ కావడంతో పంటలకు అంతర్జాతీయ విలువ ఉంటుంది.
ఈ ఒప్పందం కారణంగా ఇంకా రెండు దేశాల మధ్య దిగుమతి, ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. ఇన్‌వెస్ట్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు పెరుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి. భారత ఐటీ, టెక్స్‌టైల్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులు, స్టార్టప్‌లకు మంచి బూస్ట్ లభిస్తుంది. భారతీయ MSMEలు బ్రిటన్‌లో ఎంట్రీకి మార్గం సుగుమం అవుతుంది.
ఈ ఒప్పందం కేవలం ఆర్థిక పరంగా కాకుండా.. భారత్ గ్లోబల్ ట్రేడ్ పొజిషన్‌ను మరింత బలపరిచే సూచికగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ కుదుర్చుకున్న అత్యంత కీలక ఒప్పందాల్లో ఒకటిగా చెబుతున్నారు. ఇది కేవలం ఒప్పందం కాదు… ఇండియా–యూకే సంబంధాల్లో కొత్త అధ్యాయం అన్నది నిపుణుల మాట.
ఈ అగ్రిమెంట్‌తో బ్రిటన్, భారత్ భాగస్వామ్యంతో కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు భారత ప్రధాని మోదీ. భద్రత, రక్షణ, ఏఐ, విద్య తదితర రంగాల్లో బ్రిటన్, భారత్ కొత్తపుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఈ ఒప్పందం గురించి బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఏమన్నారో దిగువన చూడండి…
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..