Taliban: ఆఫ్ఘన్ వ్యవహారాల్లో తలదూర్చటం మీకు మంచిది కాదు.. ఇండియాకు తాలిబన్ల హెచ్చరిక

| Edited By: Phani CH

Aug 14, 2021 | 12:03 PM

ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా తన సైనికులను మోహరించిన పక్షంలో అది ఇండియాకు మంచిది కాదని తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ సుహైల్ షాహీన్ హెచ్చరించారు.

Taliban: ఆఫ్ఘన్ వ్యవహారాల్లో తలదూర్చటం మీకు మంచిది కాదు.. ఇండియాకు తాలిబన్ల హెచ్చరిక
Taliban Spokesperson
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా తన సైనికులను మోహరించిన పక్షంలో అది ఇండియాకు మంచిది కాదని తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ సుహైల్ షాహీన్ హెచ్చరించారు. వారు (ఇండియా) ఈ దేశానికి సైనిక పరంగా వఛ్చి తమ ఉనికిని చాటుకుంటే అది వారికే మంచిది కాదని, ఆఫ్ఘన్ లో ఉన్న ఇతర దేశాల బలగాలకు పట్టిన గతేమిటో చూశారని ఆయన అన్నాడు. అందువల్ల ఈ విషయంలో ఇండియాయే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో షాహీన్ పేర్కొన్నాడు. అయితే ఆఫ్ఘానిస్తాన్ అభివృద్ధికి ఇండియా అన్ని విధాలా తోడ్పడిందన్నాడు. ఇక్కడ రోడ్లు, మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం లోను, ఈ దేశ ప్రజల ఆర్థిక అభివృద్ధి లోను భారత ప్రభుత్వ కృషి ఉందని ఆయన చెప్పాడు. పైగా దోహాలో జరిగిన చర్చల్లో భారత ప్రతినిధి బృందం కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. పొరుగున ఉన్న దేశాలతో సహా ఏ ఇతర దేశమైనా తన ప్రయోజనాలకు ఆఫ్ఘన్ గడ్డ ను వినియోగించుకోరాదని, ఇది తమ పాలసీ అని షాహీన్ చెప్పాడు. ఈ దేశంలో విదేశాల రాయబార, దౌత్య కార్యాలయాలకు, దౌత్యాధికారులకు తాలిబన్ల నుంచి ముప్పు ఉండదని ఆయన వివరించాడు. తాలిబన్లు వీటిని టార్గెట్ చేయడంలేదని పేర్కొన్నాడు.

ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో సైనికపరంగా అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వాన్నీ కూడా గుర్తించరాదని ఇండియా, జర్మనీ, ఖతార్ ఇతర దేశాలు తీర్మానించాయి. ఆఫ్ఘన్ పరిస్థితిపై దోహాలో జరిగిన రెండు వేర్వేరు సమావేశాల అనంతరం ఖతార్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తాలిబన్లు, ఆఫ్ఘన్ ప్రభుత్వం పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే దిశగా శాంతి చర్చలకు పూనుకోవాలని ఈ ప్రకటనలో కోరారు. రెండో సమావేశంలో ఇండియా పాల్గొన్న విషయాన్ని అధికారులు ఇందులో గుర్తు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఏడాది అంతానికి పూర్తి జనాభాకు వ్యాక్సినేషన్ అసాధ్యం.. సీరం కంపెనీ చైర్మన్ సైరస్ పూనావాలా

Viral Photo: రోడ్డు మధ్యలో రెండు కుక్కల కౌగిలింత.. కన్నీళ్లు పెట్టుకుంటున్న సోషల్ మీడియా..