ISRO – NASA: ఇస్రో చేతికి నిసార్‌.. అంతరిక్ష రంగంలో కీలక మలుపు..

నిసార్‌ భారత్‌కు వచ్చేసింది. దీంతో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికాకు చెందిన నాసా, భారత్‌కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి

ISRO - NASA: ఇస్రో చేతికి నిసార్‌.. అంతరిక్ష రంగంలో కీలక మలుపు..
India Receives Isro Nasa Jointly Built Nisar Satelite Check Interesting Details

Updated on: Mar 09, 2023 | 12:24 PM

నిసార్‌ భారత్‌కు వచ్చేసింది. దీంతో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికాకు చెందిన నాసా, భారత్‌కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్‌ ఉపగ్రహం ఇస్రో చెంతకు చేరింది. నాసా–ఇస్రో సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌ నిసార్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారుచేసింది. అమెరికా వాయుసేనకు చెందిన సీ–17 విమానం దానిని బెంగళూరుకు తీసుకొచ్చింది.నిసార్‌ను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఏపీలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి వచ్చే ఏడాది ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిౖలైట్‌ తుది ఇంటిగ్రేషన్‌ మొదలైందని చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ ట్వీట్‌ చేసింది. వ్యవసాయ సంబంధ మ్యాపింగ్, కొండచరియలు విరిగే ప్రమాదమున్న ప్రాంతాల గుర్తింపు కోసం నిసార్‌ను వినియోగించనుంది.ప్రపంచవ్యాప్తంగా మంచు ప్రాంతాల్లో మార్పులు, భూమి పొరల్లో కదలికలు, భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, సముద్రమట్టం పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే పరిస్థితులను నిసార్‌ ఉపగ్రహం ద్వారా గుర్తించనున్నారు. ఎస్‌యూవీ వాహనం పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం 2,800 కిలోల బరువు ఉంటుందని నాసా పేర్కొంది. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మేఘాలు, దట్టమైన అడవుల్లో కూడా హై-రిజల్యూషన్‌ ఫొటోలను తీస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!