Indian COVID-19 Vaccines: కరోనా మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాలు కోలుకోలేని విధంగా మారాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోంది. కరోనా వ్యాక్సిన్ కావాలంటూ ప్రాథేయపడుతున్న దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసి అందరి మన్ననలు పొందుతోంది. అది ఏ దేశమైన భారత్ అండగా ఉంటుందని హామీనిస్తూ కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలకు భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వీకే పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల భారత్ సంతృప్తి చెందవచ్చని పాల్ పేర్కొన్నారు. అనతికాలంలోనే దాదాపు 90లక్షల మందికి వ్యాక్సిన్ అందించడం సులభమైన విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కరోనా బ్రిటన్ వేరియంట్‌తోపాటు.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వైరస్‌లు కూడా ప్రయాణికుల ద్వారా దేశంలోకి ప్రవేశించాయని డాక్టర్ పాల్ తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో ఈ కొత్తరకం వైరస్‌ను నిర్థారించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read: