India Covid-19 News: కరోనా సెకండ్ వేవ్ భారత్‌కు ఎప్పటికీ పీడకలగా మిగిలిపోనుంది. సెకండ్ వేవ్ కారణంగా భారత్ పెను ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. సెకండ్ వేవ్‌ను భారత్ అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజం అండగా నిలిచింది. పలు దేశాలు తమ వంతు సాయాన్ని అందించాయి. కొన్ని చిన్న దేశాలు కూడా ఉడుతా భక్తి సాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నాయి. కొవిడ్ రోగులకు అవసరమయ్యే మందులు, పరికరాలు తదితరాలు అందించి పెద్ద మనస్సును చాటుకున్నాయి. అలా సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు ఎన్ని దేశాలు అండగా నిలిచాయో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో గురువారం (జులై 29, 2021) వెల్లడించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 52 దేశాల నుంచి భారత్‌కు సాయం అందింది. ఆ దేశాలు మందులు, పరికరాలను భారత్‌కు పంపి ఆపన్న హస్తం అందించినట్లు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అలాగే కంపోనెంట్ 1 ద్వారా 31.5 లక్షలు, కంపోనెంట్ 2 ద్వారా 4.5 లక్షల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఇప్పటి వరకు భారత్ దిగుమతి చేసుకున్నట్లు మురళీధరన్ తెలిపారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో మందులు, వైద్య పరికరాల ఉత్పత్తి దేశంలో అవసరమైన స్థాయికి చేరుకునే వరకు ప్రపంచ దేశాలు సాయపడినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి, ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి, ప్రైవేట్ నుంచి ప్రైవేటుకు ఈ సాయం అందినట్లు వివరించారు. అలాగే విదేశాల్లోని ప్రవాస భారతీయుల సంఘాలు, కంపెనీలు కూడా భారత్‌కు సాయపడినట్లు వెల్లడించారు.
India has imported 31.5 lakh units of Sputnik Component 1 and 4.5 lakh units of Sputnik Component 2 vaccine till date: MoS MEA V Muraleedharan in Rajya Sabha
— ANI (@ANI) July 29, 2021
Also Read..
దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తున్నాయి..? మరిన్ని వైరస్‌లు దాడి చేయనున్నాయా..? సంచలన నివేదిక