Yasin Malik: యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు.. ఇస్లామిక్ దేశాల ఆరోపణలకు భారత్ గట్టి కౌంటర్

|

May 28, 2022 | 2:53 PM

కశ్మీరి వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్(Yasin Malik) కు శిక్ష విధించిన భారత్ పై ఇస్లామిక్ దేశాలు అర్థరహిత కామెంట్లు చేయడంపై భారత్(India) మండిపడింది. వారి ఆరోపణలకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ...

Yasin Malik: యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు.. ఇస్లామిక్ దేశాల ఆరోపణలకు భారత్ గట్టి కౌంటర్
Bagchi
Follow us on

కశ్మీరి వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్(Yasin Malik) కు శిక్ష విధించిన భారత్ పై ఇస్లామిక్ దేశాలు అర్థరహిత కామెంట్లు చేయడంపై భారత్(India) మండిపడింది. వారి ఆరోపణలకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్న సమయంలో దానిని సమర్థించడం ఏమాత్రం సమంజసం కాదని ఓఐసీ( ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్) హెచ్చరించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, దేశంపై దాడికి కుట్ర వంటి నేరాల్లో యాసిన్ మాలిక్ ను దోషిగా తేల్చి, అతనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్ తీర్పుపై ఇస్లామిక్ దేశాలు అనుచిత వ్యాఖ్యలు చేశాయి. ఇస్లామిక్‌ దేశాల(Islamic Countries) మానవ హక్కుల విభాగం ఓఐసీ- ఐపీహెచ్‌ఆర్‌సీ యాసిన్ కు విధించిన శిక్షను ఖండించింది. యాసిన్‌ మాలిక్‌ శిక్ష విషయంలో భారత్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ దీటుగా బదులిచ్చారు. యాసిన్ మాలిక్ కు విధించిన శిక్షపై ఇస్లామిక్ దేశాలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఉగ్ర కార్యకలాపాలకు ఆ దేశాలు మద్దతిస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సహించకూడదని యావత్‌ ప్రపంచం కోరుకుంటోందని స్పష్టం చేశారు.

ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలిన వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మాలిక్ కోర్టు హాలులో ఉన్నారు. యాసిన్ మాలిక్‌పై తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా కోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు, ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని అభ్యర్థించింది. మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (UAPA) కింద చేసిన ఆరోపణలతో సహా తనపై వచ్చిన అన్ని ఆరోపణలను మాలిక్ అంగీకరించారు. టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో యాసిన్‌మాలిక్‌ను దోషిగా తేల్చింది ఎన్‌ఐఏ కోర్టు.

కశ్మీర్‌ వేర్పాటు ఉగ్రవాదం కేసులో కీలక సూత్రధారి యాసిన్‌ మాలిక్‌. వేర్పాటువాదుల్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. డు. ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో యాసిన్‌ మాలిక్‌ సిద్ధహస్తుడని ఎన్‌ఐఏ విచారణలో తేలింది. కోర్టు తీర్పు సందర్భంగా ఢిల్లీతో పాటు కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి