India – China Border Standoff: తూర్పు లడఖ్‌లో పూర్త‌యిన భారత్ – చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ‌..

|

Feb 20, 2021 | 12:02 AM

Pangong Tso disengagement: తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సుకు ఇరువైపులా ఉన్న భారత్ -చైనా బలగాల ఉపసంహ‌ర‌ణ ప్ర‌క్రియ శుక్ర‌వారం పూర్త‌యింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి 10..

India - China Border Standoff: తూర్పు లడఖ్‌లో పూర్త‌యిన భారత్ - చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ‌..
Follow us on

Pangong Tso disengagement: తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సుకు ఇరువైపులా ఉన్న భారత్ -చైనా బలగాల ఉపసంహ‌ర‌ణ ప్ర‌క్రియ శుక్ర‌వారం పూర్త‌యింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి 10 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.. తాజాగా పూర్తయింది. ఈ క్రమంలో శ‌నివారం భారత్-చైనా దేశాల సీనియ‌ర్ క‌మాండ‌ర్ల స్థాయి ప‌దో రౌండ్ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

అయితే గ‌త వారం జరిగిన తొమ్మిదోసారి చర్చల్లో ఇరు దేశాల మధ్య బలగాల ఉపసంహరణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా 150 చైనా యుద్ధ ట్యాంకులు, 5 వేల మంది చైనీస్ పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు వెన‌క్కి వెళ్లిపోయారు. అంతేకాకుండా భారత సైన్యం కూడా ఈ ప్రాంతాన్ని వీడి వెనుకకువచ్చింది. ఈ బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి ఇటీవల ఇండియ‌న్ ఆర్మీ వీడయోను సైతం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

2019 జూన్‌లో గాల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. చైనా హింసాత్మక దాడిలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read:

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కీలక నిర్ణయం.. 17 ఏళ్ల ఆ ఇంటి బంధాన్ని తెంచుకోనున్న వైనం