India – China talks today: భారత్ – చైనా మధ్య నెలకొన్న సరిహద్దు పరిస్థితులకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఈ రోజు పదోసారి సైనిక చర్చలు జరగనున్నాయి. మిలటరీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో వాస్తవాధీన రేఖ వెంబడినున్న చైనాలోని మోల్డో ప్రాంతంలో ఈ చర్చలు జరగనున్నాయి. శుక్రవారం తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సుకు ఇరువైపులా ఉన్న భారత్ -చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య జరగనున్న చర్చలపై ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా.. గత నెల 24వ తేదీన చివరిసారిగా భారత్-చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. అనంతరం ఫిబ్రవరి 10నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. అయితే.. రోజు జరగే చర్చల్లో ప్రధానంగా హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సంగ్ ప్లెయిన్స్ వంటి ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపై చర్చించనున్నట్లు సమాచారం.
అయితే హాట్ స్పింగ్స్, గోగ్రా ప్రాంతాల్లో మొహరింపుల ఉపసంహరణపై ప్రధానంగా చర్చిస్తామని, కానీ 900 కిలోమీటర్ల పొడవున్న దేప్సంగ్ ప్లెయిన్స్‌లో కొంత సంక్లిష్టత నెలకొందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీంతో దేప్సంగ్ ప్టెయిన్స్‌లో ఉపసంహరణలకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: