Hindu Priest: ఉగ్రమూకలను చూసి సైన్యం పారిపోయింది ఆ దేశంలోనే కావచ్చు.. ఉగ్రనీడకు చేరుకున్న ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్ల పరిపాలన మొదలు కానుంది. ఈ నేపథ్యంలో లక్షలాదిమంది ఆఫ్గన్లు ఇతరదేశాల్లో తలదాచుకోవడానికి ప్రాణాలను లెక్కచేయకుండా తరలి వెళ్ళుతున్నారు. ప్రపంచంలోని చాలామందిని ఆఫ్గన్ లో తాజా పరిస్థితిలు ఆవేదన కలిగిస్తున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ దేశం ఉగ్రానీడకు చేరుకుంది. 20 ఏళ్ల క్రితం ఐదేళ్ల పాటు తాలిబన్ల అరాచక పాలనను చూసిన ఆ దేశ ప్రజలు ఇప్పుడు తాలిబన్ల పాలన అంటేనే వణికిపోతున్నారు.
అక్కడి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.. ప్రధాని సహా సైనికులు, అనేకమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతరదేశాల పయనమయ్యారు. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు పూర్తిగా దేశాన్ని గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆదేశ పౌరులైన ముస్లింలు తాలిబన్ల పరిపానకు భయపడి పారిపోతుంటే.. ఓ హిందూ పూజారి మాత్రం ఆఫ్ఘన్ విడిచివెళ్లేదే లేదని భీష్మించుకు కూర్చున్నాడు.
కాబుల్ లోని రత్తన్ నాథ్ ఆలయంలో పండిట్ రాజేష్ కుమార్ పూజారిగా ఉన్నారు. ఆఫ్గనిస్తాన్‌ను విడిచి పెట్టేది లేదన్నారు. రాజేష్. ఆలయాన్ని విడిచి రానని చెప్తున్నారు. వందల ఏళ్లగా తమ పూర్వీకులు ఇక్కడే ఉంటూ గుడి బాగోగులు చూసుకుంటున్నారని.. ఇప్పుడు రత్తన్ నాథ్ ఆలయాన్ని వదిలేసి వెళ్లనని చెప్తున్నారు. తాలిబన్లు తనను చంపినా అది దేవుడి సేవగానే భావిస్తానని.. అంతేకాని దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. పండిట్ రాజేష్ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.
Also Read: Dasari Arunkumar: దాసరి తనయుడు అరుణ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. వివరాల్లోకి వెళ్తే..