I2U2: అంతర్జాతీయ వేదికపై సరికొత్త ‘గ్రూప్’.. అందులో భాగస్వామిగా భారత్..

|

Jun 16, 2022 | 5:48 AM

I2U2: అంతర్జాతీయ వేదికపై ఇండియా, ఇజ్రాయెల్, UAE, అమెరికా సరికొత్త గ్రూప్‌గా ఏర్పడుతున్నాయి. ఐ2యూ2గా పిలిచే ఈ కూటమి తొలి భేటీ వచ్చే నెల జరగనుంది.

I2U2: అంతర్జాతీయ వేదికపై సరికొత్త ‘గ్రూప్’.. అందులో భాగస్వామిగా భారత్..
I2u2
Follow us on

I2U2: అంతర్జాతీయ వేదికపై ఇండియా, ఇజ్రాయెల్, UAE, అమెరికా సరికొత్త గ్రూప్‌గా ఏర్పడుతున్నాయి. ఐ2యూ2గా పిలిచే ఈ కూటమి తొలి భేటీ వచ్చే నెల జరగనుంది. పశ్చిమాసియాలోని కీలక దేశాలతో కలిసి భారత్‌- అమెరికాలు సరికొత్త కూటమి ఏర్పాటు చేశాయి. ఐ2యూ2గా పిలిచే ఈ కూటమిలో ఇండియా, ఇజ్రాయెల్, UAE, అమెరికా సభ్య దేశాలుగా ఉంటాయి.. ఆర్థిక, వాణిజ్య, రక్షణ, సాంకేతిక, ఆహర భద్రత, వైద్యం, వాతావరణం అంశాలపై కలిసి పని చేసేందుకు ఈ సరికొత్త కూటమి ఏర్పాటైంది.. ఐ2యూ2 తొలి సమావేశం వచ్చే నెల వర్చువల్‌ రూపంలో నిర్వహించాలని నిర్ణయించారు. వర్చవల్‌గా జరిగే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ జూలై 13 నుంచి 16 వరకూ పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తున్నారు.. ఈ సందర్భంగా ఐ2యూ2 వర్చువల్‌ మీట్‌ జరుగుతుందని వైట్‌హౌస్‌ తెలిపింది. ప్రపంచంలోనే భారీ వినియోగ మార్కెట్‌గా ఉన్న భారత్‌తో పలు అంశాల్లో కనిసి పని చేసేందుకు అమెరికా మొదటి నుంచి ఆసక్తితో ఉందని ఆ దేశం గుర్తు చేసింది. అదే విధంగా ఇజ్రాయిల్‌-యూఏఈల మధ్య ఇటీవలి కాలంలో ఆర్థిక సంబంధాలు మెరుగవుతున్నాయని, భారత్‌- అమెరికాలో ఈ దేశాలతో కూటమిగా ఏర్పడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నయని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు.. ఈ నాలుగు దేశాల ఐ2యూ2గా కూటమి ప్రభావం మున్ముందు అన్ని రంగాల మీద బలంగా ఉంటుందని చెబుతున్నారు.