Songbirds Crash: న్యూ యార్క్ సిటీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పక్షి కళేబరాలతో నిండిపోయింది. ఈ హృదయవిదారక ఘటన కొంతమంది ప్రకృతి ప్రేమికులు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. న్యూ యార్క్ నగరానికి వలస వచ్చిన వందలాది పక్షులు నగరంలోని గ్లాస్ టవర్స్ ను ఢీ కొనడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఆకాశాన్ని తాకేవిధంగా నిర్మిస్తున్న భవనాలను ఢీకొని పక్షులు మరణిస్తున్నాయంటూ కన్జర్వేషన్ అండ్ సైన్స్ అసోసియేట్ డైరెక్టర్ కైట్లిన్ పార్కిన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రెండు రోజులుగా ఇక్కడ ఉన్న తుఫాన్ వాతావరణం కూడా పక్షుల మరణానికి కారణమని తెలిపారు. ఆకాశం మేఘావృతంగా ఉన్న సమయంలోనూ రాత్రి సమయంలో పక్షులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
Some of the 226 dead birds I picked up this morning while window collision monitoring for @NYCAudubon. 205 from @3NYWTC and @4WTC alone. Many others swept up, inaccessible, or too mangled to collect. 30 injured to @wildbirdfund. If you’re in NYC today, be careful where you step. pic.twitter.com/RTjm82NIpy
— Melissa Breyer (@MelissaBreyer) September 14, 2021
వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్‌ల చుట్టూ ఉన్న కాలిబాటలపై దాదాపు 300 పక్షులు మరణించి ఉన్నాయంటూ వాలంటీర్ మెలిస్సా బ్రేయర్, ట్విట్ చేశారు. ఇది చాలా బాధకలిగిస్తుందని.. ఇక నుంచి అయినా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు , ఇతర భవనాల యజమానులు రాత్రిపూట లైట్లను డిమ్ చేయడం చేసి.. పక్షులకు కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పక్షుల మరణాలను తగ్గించడానికి ప్రతి ఒక్క భవన యజమాని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
I did this for 65 minutes straight doing one loop around @4WTC and @3NYWTC — most of these before sunrise. Please can we turn off lights during migration??? pic.twitter.com/pCXoJkUXo0
— Melissa Breyer (@MelissaBreyer) September 14, 2021
ఇప్పటికే మంగళవారం మొత్తం 77 పక్షులను వెస్ట్ సైడ్‌లోని వైల్డ్ బర్డ్ ఫండ్ పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారని, వాటిలో ఎక్కువ భాగం ట్రేడ్ సెంటర్ ప్రాంతం నుండి వచ్చినట్లు డైరెక్టర్ రితామరీ మెక్‌మహాన్ తెలిపారు. గాయపడిన పక్షులకు చికిత్సనందించడానికి వాటిని మరింత కేరింగ్ గా చూసుకోవడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పక్షులకు వైల్డ్ బర్డ్ ఫండ్ సిబ్బంది ఆహారం, నీరు, దెబ్బలను తగ్గించే మందులను ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ముఫై పక్షులు కోలుకున్నాయని.. వాటిని ప్రకృతిలో విడిచిపెట్టినట్లు తెలిపారు.
Also Read: