AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine: యుద్ధం వేళ ఆందోళన కలిగిస్తున్న లైంగిక దాడులు.. చిన్నారులనూ వదలని వైనం

రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) యుద్ధం ప్రారంభమై రెండు నెలలకు పైనే అవుతున్నా యుద్ధం(War) జరుగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించింది. రష్యా ఇప్పటి వరకు 24 వేల మందికి పైగా....

Russia - Ukraine: యుద్ధం వేళ ఆందోళన కలిగిస్తున్న లైంగిక దాడులు.. చిన్నారులనూ వదలని వైనం
Minor girl raped
Ganesh Mudavath
|

Updated on: Apr 28, 2022 | 1:56 PM

Share

రష్యా – ఉక్రెయిన్(Russia – Ukraine) యుద్ధం ప్రారంభమై రెండు నెలలకు పైనే అవుతున్నా యుద్ధం(War) జరుగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించింది. రష్యా ఇప్పటి వరకు 24 వేల మందికి పైగా సైనికులను కోల్పోయింది. అయినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలైన డొనెట్స్క్‌, ఖర్కీవ్‌ వంటి ప్రాంతాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాము సామాన్యులపై దాడి చేయడం లేదని.. సైన్యాన్నే లక్ష్యంగా తీసుకుని యుద్ధం ప్రారంభించిన పుతిన్.. ఉక్రెయిన్‌లోని మహిళలు, చిన్నారులనూ వదలడం లేదు. రష్యా సైనికులపై దాదాపు 400లకు పైగా అత్యాచార కేసులు నమోదైనట్టు ఉక్రెయిన్‌ అంబుడ్స్‌మెన్‌ లియుడ్‌మైలా డెనిసోవా వెల్లడించారు. లైంగిక హింసకు సంబంధించి నివేదించేందుకు హాట్‌లైన్‌ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్‌ 1 నుంచి 14 మధ్య కాలంలో తమ కార్యాలయానికి దాదాపు 400లకు పైగా లైంగిక హింసకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు చెప్పారు. గత 63 రోజలుగా కొనసాగుతున్న యుద్ధంలో 24,200 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ప్రకటించింది.

ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వరకు రష్యా 1,300 క్షిపణుల్ని ప్రయోగించినట్టు ఉక్రెయిన్‌ డిప్యూటీ రక్షణ మంత్రి అన్నా మలయార్‌ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో క్షిపణుల నిల్వలు సగానికి పడిపోయాయన్నారు. రష్యా యుద్ధంలో 217 మంది చిన్నారులు మృతిచెందగా.. 610 మందికి పైగా గాయపడినట్టు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది.

గ్రాఫిక్ రూపంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వివరాలు

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

IPL 2022: ట్రెండ్ మారింది.. టాప్ 4 జట్ల విజయాల నుంచి ముంబై, చెన్నై‌ ఓటముల వరకు.. కారణం ఏంటో తెలుసా?

Vivo: వచ్చే నెలలో వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. Vivo T1 ప్రో, Vivo T1 44W పేరుతో విడుదల..

Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?