
ట్రంప్ దెబ్బ మామూలుగా పడలేదు. భారత్‌పై కనికరం లేకుండా 25శాతం సుంకాలని వేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశాను.. అవన్నీ ట్రేడ్ డీల్స్ బెదిరింపులతోనే అంటూ గప్పాలు కొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు భారత్‌ను దొంగదెబ్బతీశారు. 25శాతం సుంకాలతోపాటు.. బయటకు చెప్పని పెనాల్టీ కూడా విధించారు. రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్న కారణంగానే పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే 25శాతం ప్లస్ పెనాల్టీ అంటే అది ఎంత శాతానికి చేరుతుందో ఇప్పడే బయటపడే విషయం కాదు. ట్రంప్ సుంకాలు భారత్‌లోని చాలా రంగాలపై ప్రభావం పడబోతోంది. ఆగస్ట్ 1 నుంచే ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆయా రంగాల షేర్లు ఇప్పటికే కుప్పకూలాయి. భారత్‌కు అమెరికా ఎగుమతులు 41.8బిలియన్ డాలర్లుగా ఉంటే.. అమెరికాకు భారత్ ఎగుమతులు 87.4బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు ఏడున్నర లక్షల కోట్ల విలువైన సరుకులను భారత్ అమెరికాకు చేరుస్తోంది. ఇప్పుడు ఈ ఎగుమతులపై ట్రంప్ 25% సుంకాలు విధిస్తే.. భారతీయ ఆర్థిక వ్యవస్థ 0.5 శాతం జీడీపీని కోల్పోనుంది. ఇది పలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోర్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌పై వీటి ప్రభావం భారీగా ఉండబోతోంది. యాపిల్ ఐఫోన్లతోపాటు.. పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు భారత్‌లోనే తయారై.. అమెరికాకు ఎగుమతు అవుతున్నాయి. వీటిపై 25శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించబోతున్నారు. అమెరికాకు 24 బిలియన్ డాలర్లు.. అంటే 2లక్షల కోట్లకు పైగానే భారత ఎగుమతులున్నాయి....