
Nancy Crampton: ఒకప్పుడు భర్తను చంపడం ఎలా? (how to murder your husband) అనే నవలను వ్రాసిన అనే ఆన్‌లైన్ శృంగార నవలా రచయిత్రి పోర్ట్‌ల్యాండ్‌లోని తన భర్త ఆఫీస్ లోనే అతడిని హత్య చేసింది. ఈ దారుణ ఘటన నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది. హత్య కేసుని విచారించిన కోర్టు.. సోమవారం తీర్పునిచ్చింది. భర్తను హత్య చేసినందుకు ఆ రచయిత్రికి సోమవారం పెరోల్ తో కూడిన జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే..
అమెరికా పోర్ట్‌లాండ్‌కు చెందిన శృంగార నవల రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీకి (71). నాన్సీ తన తన భర్త డేన్ బ్రోఫీని (63) అతడి ఆఫీసులోనే హత్య చేసింది. 2018లో ఒరేగాన్ కల్నరీ ఇన్స్టిట్యూట్లో డేన్ బ్రోఫీని తుపాకీతో కాల్చి మారీ హత్యచేసింది నాన్సీ. అయితే డబ్బుకోసమే ఆమె తన భర్తను హత్య చేసినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు. అతని జీవిత బీమా డబ్బు కోసం ఇంతటి దారుణం చేసినట్లు విచారణలో తేలింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ హత్య సంచలనం సృష్టించింది.
Daniel Brophy
నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ కేసుని ఏడువారాల పాటు విచారించిన కోర్టు.. నాన్సీని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. 25 సంవత్సరాల శిక్ష తర్వాత పెరోల్ వచ్చే అవకాశం ఉందని KGW-TV సోమవారం నివేదించింది.
హత్య జరిగిన సమయంలో దంపతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రాసిక్యూషన్ కోర్టుకు చెప్పింది. ఆమె ఆన్‌లైన్‌లో తుపాకీ కోసం వెదికిమరీ.. “ఘోస్ట్ గన్” కిట్‌ను కొనుగోలు చేసిందని.. ఆపై తుపాకీ ప్రదర్శనలో గ్లాక్ 17 హ్యాండ్‌గన్‌ని కొనుగోలు చేసిందని ప్రాసిక్యూషన్ తెలిపింది.
అయితే నాన్సీ తరపు లాయర్.. ప్రాసిక్యూషన్ వాదన సరికాదని ఈ దంపతులు చాలా స్నేహంగా ఉండేవారని పేర్కొన్నారు. అందుకు నాన్సీతరఫున సాక్ష్యాలను ప్రవేశ పెట్టారు.
నాన్సీ కోర్టుకు.. తమ రిటైర్మెంట్ ప్లానింగ్‌లో భాగంగా జీవిత బీమా పాలసీలను తను కొనుగోలు చేసినట్లు చెప్పారు. తమ అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళికలను వేసుకున్నామని చెప్పారు. అంతేకాదు తాను తుపాకీల గురించి నవల కోసం పరిశోధన చేసినట్లు పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..