Hong Kong: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి గుడ్‌న్యూస్.. బార్లు, నైట్‌క్లబ్‌ల్లో వారికి మాత్రమే అనుమతి.. ఇదెక్కడంటే..?

|

Apr 27, 2021 | 4:53 PM

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు హాంకాంగ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం ప్రత్యేకంగా బార్లు, నైట్‌క్లబ్‌లు, కారావ్‌కో పార్లర్లను తెరవనున్నట్లు ప్రకటించింది.

Hong Kong: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి గుడ్‌న్యూస్.. బార్లు, నైట్‌క్లబ్‌ల్లో వారికి మాత్రమే అనుమతి.. ఇదెక్కడంటే..?
Hong Kong To Reopen Bars
Follow us on

Hong Kong to reopen bars: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు హాంకాంగ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం ప్రత్యేకంగా బార్లు, నైట్‌క్లబ్‌లు, కారావ్‌కో పార్లర్లను తెరవనున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి మందుబాబుల కోసం ఒపెన్ చేస్తున్నట్లు, అలాగే, అర్ధరాత్రి దాటే వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు మరింత మందిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వినియోగదారులు కనీసం ఒక్క డోసు వ్యాక్సినైనా వేయించుకుంటేనే బార్లు, నైట్‌క్లబ్‌లు, పార్లర్లలోకి అనుమతిస్తారని హాంగ్‌కాంగ్ ప్రభుత్వం పేర్కొంది. అలాగే, ఆయా క్లబ్‌లు, బార్లు, పార్లర్ల సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేయించుకుంటేనే తెరిచేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి హాంకాంగ్ బార్‌లు, నైట్‌క్లబ్‌లను తిరిగి తెరుస్తున్నట్లు హాంగ్‌కాంగ్ కేంద్ర ఆర్థిక ఆరోగ్య కార్యదర్శి సోఫియా చాన్ మంగళవారం తెలిపారు.

తాజా నిబంధనల ప్రకారం బార్లు, నైట్‌క్లబ్‌లను అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కో టేబుల్‌కు ఇద్దరు మించకూడదని షరతు విధించింది. ఇక, కరావోకో రూమ్స్‌లోకి నలుగురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, రెస్టారెంట్లను కూడా టేబుల్ పరిమితితో అనుమతిస్తామని చాన్ తెలిపారు. సిబ్బంది మొత్తం వ్యాక్సినేషన్ వేసుకుంటే ఈటరీలను అనుమతిస్తామన్నారు. అటువంటి ఈటరీలు ఒక్కో టేబుల్‌కు ఆరుగురు చొప్పున అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. అయితే, ఆయా సంస్థలు తొలుత ‘లీవ్‌హోంసేఫ్’ యాప్‌లో తొలుత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని చాన్ వివరించారు.

ఇదిలావుంటే, హాంకాంగ్ జనాభా 7.5 మిలియన్లలో 11 శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫిబ్రవరిలో హాంగ్ కాంగ్ ప్రభుత్వం సినోవాక్ నుండి టీకాలు వేయడం ప్రారంభించింది. మార్చిలో జర్మనీకి చెందిన బయోఎంటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అందించడం ప్రారంభించింది.

Read Also.. Oxygen Plants: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక.. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు: సీఎం కేజ్రీవాల్