
HIV/AIDS Medicine: వైద్యశాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అత్యంత ప్రమాదకర హెచ్‌ఐవీకి మెడిసిన్ కనుగొన్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఎయిడ్స్‌కు కారణమయ్యే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV)ను పూర్తిగా ఖతం చేసే మెడిసిన్‌ను ఆ దేశానికి చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. జన్యు మార్పిడి విధానంలో డెవలప్ చేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఒక్క డోసు ఇవ్వడం ద్వారా హెచ్‌ఐవీకి అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోందని పేర్కొంటున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్ ప్రచురించింది. ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే వైట్ బ్లెడ్ సెల్స్(type B white blood cells) తయారవుతాయి. వీటినే బీ సెల్స్ అంటారు. ఇవే బాడీలోని బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఎముక మజ్జలో పుట్టిన బీ సెల్స్.. అక్కడి నుంచి బ్లడ్‌లోకి, గ్రంథుల వ్యవస్థల్లోకి ఎంటరవుతాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. బి-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి విభజిస్తాయి.
ఈ క్రమంలోని వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బి-సెల్స్ జన్యువుల్లో మార్పులు చేశారురు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఇలా మార్పులు చేసిన బీ సెల్స్… వైరస్ ఎదురుపడినా, దాని ప్రభావానికి గురికావు. వైరస్ మార్పులకు అనుగుణంగా ఈ కణాలు కూడా మారిపోతాయి. వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. హెచ్‌ఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ప్రొడ్యూస్ చేసేలా ఇమ్యూనిటీ సిస్టమ్‌ను ప్రేరేపిస్తాయి. హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ ఇంజక్షన్ పని చేస్తుంది. అయితే దీనిపై మరికొన్ని లోతైన పరిశోధనలు, వ్యక్తులపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఇంజక్షన్ అందుబాటులోకి రావాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి