Vaccination: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్.. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్‌..

|

Feb 19, 2021 | 1:08 AM

COVID-19 Vaccine India: దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే దాదాపు కోటి మంది వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ..

Vaccination: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్.. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్‌..
COVID-19 Vaccine India
Follow us on

COVID-19 Vaccine India: దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే దాదాపు కోటి మంది వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రపంచంలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్‌ ముందు వరుసలో ఉండగా.. భారత్‌ మూడో స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అమెరికాలో రెండు నెలల కింద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ ఇప్పటివరకు 5.5 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించారు. బ్రిటన్‌లోనూ ఇప్పటికే 1.5కోట్ల మందికి పంపిణీ చేశారు. తాజాగా భారత్‌ కూడా 94 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వ్యాక్సిన్ పంపణీ చేసింది.

అయితే, అమెరికా, బ్రిటన్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించి 60 రోజులు పూర్తికాగా.. భారత్‌ మాత్రం 33 రోజుల్లోనే దాదాపు కోటి మందికి వ్యాక్సిన్‌‌ను పంపిణీ చేసిందని వైద్య శాఖ తెలిపింది. జనవరి 16న భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. కాగా ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు పంపిణీ ప్రక్రియను మొదలైంది. దేశవ్యాప్తంగా గురువారం ఉదయం వరకు 94,22,228 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ డోసులను అందించారు. వీరిలో 61లక్షల 96వేల మంది వైద్యారోగ్య సిబ్బందికి తొలి డోసు ఇచ్చారు. అంతేకాకుండా మూడు లక్షల మందికి రెండో డోసు కూడా ఇచ్చారు. వీరితో పాటు మరో 28లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి కూడా వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

Covid-19 vaccine: వారికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి కోవిడ్ వ్యాక్సిన్: ఎయిమ్స్‌ డైరెక్టర్

Covid vaccine: కీలక నిర్ణయం తీసుకున్న భారత్.. శాంతి బలగాలకు బహుమతిగా 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు..