Hamas Chief: ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ చీఫ్‌ హతం.. అధికారికంగా ప్రకటన

|

Oct 17, 2024 | 11:05 PM

కొద్ది రోజుల క్రితం, అతను ఇజ్రాయెల్ బందీల మధ్య దాక్కున్నాడని వార్తలు వచ్చాయి. అంతకుముందు కూడా సిన్వార్ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి కాని ఇజ్రాయెల్ సైన్యం దానిని ధృవీకరించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న..

Hamas Chief: ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ చీఫ్‌ హతం.. అధికారికంగా ప్రకటన
Hamas Chief
Follow us on

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఐడీఎఫ్‌ దాడుల్లో అక్టోబరు 7 నాటి దాడుల హమాస్‌ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ హతమైనట్లు ఇజ్రాయెల్‌ ధృవీకరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ గురువారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను గాజాలో సైనిక ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ దళాలు చంపినట్లు ధృవీకరించారు. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గాజాలో ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు హమాస్ ఉగ్రవాదులు మరణించారు. వారిలో యాహ్యా సిన్వార్ కూడా ఉన్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇది నిర్ధారణ అయ్యింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రధారిగా హమాస్ అధినేత సిన్వార్ ఉన్నారు.

సిన్వార్‌ను ఆగస్టులో హమాస్ చీఫ్‌గా నియామకం:

జూలై 31న టెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియా మరణించిన తర్వాత హమాస్ కమాండ్‌ని యాహ్యా సిన్వార్‌కు ఆగస్టులోనే హమాస్ చీఫ్‌ బాధ్యతలు అప్పగించారు. గురువారం ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఐడిఎఫ్ ఆపరేషన్ సమయంలో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులలో యాహ్యా సిన్వార్ ఒకడని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసింది.

కొద్ది రోజుల క్రితం, అతను ఇజ్రాయెల్ బందీల మధ్య దాక్కున్నాడని వార్తలు వచ్చాయి. అంతకుముందు కూడా సిన్వార్ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి కాని ఇజ్రాయెల్ సైన్యం దానిని ధృవీకరించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలలో, శిథిలాలలో చిక్కుకున్న సిన్వార్‌లా ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇజ్రాయెల్ దాడిలో అతని తల భాగం దెబ్బతింది.

యాహ్యా సిన్వార్ ఎవరు?

యాహ్యా సిన్వార్ హమాస్ రాజకీయ చీఫ్. ఇస్మాయిల్ హనియా మరణం తర్వాత ఆగస్టులోనే అతనికి సంస్థ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. సిన్వార్ 1962లో గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంలో జన్మించాడు. ఇజ్రాయెల్ మూడుసార్లు సిన్వార్‌ను అరెస్టు చేసింది. అయితే 2011లో ఇజ్రాయెల్ సైనికుడికి బదులుగా 127 మంది ఖైదీలతో పాటు సిన్వార్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. 2015 సెప్టెంబర్‌లో అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదుల బ్లాక్‌లిస్ట్‌లో సిన్వార్ పేరును చేర్చింది. హమాస్‌ మాజీ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా మరణానంతరం సంస్థకు సంబంధించిన అన్ని నిర్ణయాలను సిన్వార్‌ తీసుకునేవారు. సిన్వార్ క్రూరమైన వైఖరి కారణంగా అతను ఇజ్రాయెల్‌లో ‘ది బుట్చర్ ఆఫ్ ఖాన్ యూనిస్’ అని పిలుస్తారు.

 


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి