అంత అందమైన ప్రదేశంలో ఇల్లు ఫ్రీ అట…!

అంటికితెరా… గ్రీస్‌లోని ఈ దీవి ఎంత అంద‌మైన ప్ర‌దేశ‌మో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే సుంద‌రమైన దృశ్యాలు, ప్ర‌కృతి మ‌నోహ‌ర‌త‌, ఆక‌ట్టుకునే ప‌చ్చ‌ద‌నం, స‌ముద్రాలు, బీచ్‌లు, అద్భుత‌మైన కొండ చ‌రియ‌లు.. వాహ్‌.. చెబితేనే వాటి ద‌గ్గ‌ర ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది క‌దా. ఇక అలాంటి ప్ర‌దేశాల్లో నివ‌సిస్తే క‌లిగే ఎంజాయ్‌మెంటే వేరు. అయితే, మారుమూల ఉండే ఈ దీవిలో ప్రస్తుతం జనాభా చాలా తక్కువగా ఉందట. దాంతో ముందు ముందు ఆ గ్రామం కనుమరుగైపోతుందేమోనన్న భయంతో స్థానిక […]

అంత అందమైన ప్రదేశంలో ఇల్లు ఫ్రీ అట...!

Edited By:

Updated on: Aug 25, 2019 | 5:54 PM

అంటికితెరా… గ్రీస్‌లోని ఈ దీవి ఎంత అంద‌మైన ప్ర‌దేశ‌మో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే సుంద‌రమైన దృశ్యాలు, ప్ర‌కృతి మ‌నోహ‌ర‌త‌, ఆక‌ట్టుకునే ప‌చ్చ‌ద‌నం, స‌ముద్రాలు, బీచ్‌లు, అద్భుత‌మైన కొండ చ‌రియ‌లు.. వాహ్‌.. చెబితేనే వాటి ద‌గ్గ‌ర ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది క‌దా. ఇక అలాంటి ప్ర‌దేశాల్లో నివ‌సిస్తే క‌లిగే ఎంజాయ్‌మెంటే వేరు. అయితే, మారుమూల ఉండే ఈ దీవిలో ప్రస్తుతం జనాభా చాలా తక్కువగా ఉందట. దాంతో ముందు ముందు ఆ గ్రామం కనుమరుగైపోతుందేమోనన్న భయంతో స్థానిక చర్చి నిర్వాహకులు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే… ఎవరైనా అంటికితెరాకి వచ్చి ఉంటే ఉచితంగా ఇల్లు ఇవ్వడంతో పాటు మూడేళ్ల పాటు నెలకు సుమారు నలభైవేల రూపాయల చొప్పున భత్యంగా ఇస్తారట. దాంతో ఇప్పటికే కొన్ని కుటుంబాలు అక్కడికి మారడానికి ధరఖాస్తు చేసుకున్నాయి. మీకూ ఆసక్తి ఉంటే ప్రయత్నించొచ్చు.