Corona: భారత్ లో కరోనా కల్లోలానికి ప్రపంచం కదిలిపోతోంది. వివిధ దేశాలు మేమున్నామంటూ సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా లో ఇబ్బందులు.. మందులు దొరకక చోటుచేసుకుంటున్న మరణాలు అన్నీ వివిధ దేశాల్లో ఉన్న వారిని కలచి వేస్తున్నాయి. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కౌంటర్ సత్య నాదెళ్ళ ఇండియాకు సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. కరోనాను ఎదుర్కోవడం కోసం తమ సంస్థ యూనిసెఫ్ కు 135 కోట్ల నిధులు ఇస్తోందని చెప్పిన సుందర్ పిచాయ్ గివ్ ఇండియా కార్యక్రమం కోసం వైద్య సామగ్రి, అధికంగా రిస్క్ ఉన్న కమ్యూనిటీలకు అవసరమైన సహాయం అదేవిధంగా ఘోరంగా విరుచుకుపడుతున్న వైరస్ గురించిన క్లిష్టమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి అవసరమయ్యే నిధులను తమ సంస్థ అందచేస్తుందనీ ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
భారతదేశంలో ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితి చూసి తాను హృదయ విదారక స్థితిలో ఉన్నానని సత్య నాదెళ్ళ చెప్పారు. అలాగే తమ సంస్థ తన వనరులను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని సహాయక చర్యల కోసం ఉపయోగించడం అదేవిధంగా ఆక్సిజన్ పరికరాల కొనుగోలుకు మద్దతు ఇస్తుందని అన్నారు. సంక్షోభం మధ్య భారత్‌కు సహాయం చేస్తామని హామీ ఇచ్చిన అమెరికా ప్రభుత్వానికి భారతీయ-అమెరికన్ సీఈఓ ఒక ట్వీట్‌లో ధన్యవాదాలు తెలిపారు.
“భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల వల్ల నా గుండె పగిలిపోయింది. సహాయానికి యుఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు నేను కృతజ్ఞుడను. సహాయక చర్యలకు సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ తన వాయిస్, వనరులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగిస్తుంది అదేవిధంగా క్లిష్టమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు మద్దతు ఇస్తుంది, ” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కరోనావైరస్ రెండో వేవ్ తట్టుకోవడానికి దేశం పోరాడుతుండటంతో అనేక మంది ప్రముఖులు భారతదేశానికి సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు రోజుకు 3 లక్షలు దాటుతున్నాయి. ఆసుపత్రి పడకల కొరత అలాగే, క్లిష్టమైన కోవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి.
ఇప్పటికే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతదేశానికి అవసరమైన వైద్య ప్రాణాలను కాపాడే సామగ్రిని అత్యవసరంగా పంపడంతో సహా అన్ని విధాలుగానూ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. “మహమ్మారి ప్రారంభంలో అమెరికాలో ఆస్పత్రులు దెబ్బతిన్నందున భారతదేశం తన సహాయం పంపినట్లే, భారతదేశానికి అవసరమైన సమయంలో సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము” అని జో బిడెన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు వెంటిలేటర్లు. ఆక్సిజన్ సాంద్రతలతో సహా – భారతదేశానికి ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలను పంపుతున్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ తెలిపింది.
సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన మరో హీరోయిన్.. ఇదే నా ఆఖరి పోస్ట్ అంటూ ట్వీట్..