పెరూ లో దారుణం చోటు చేసుకుంది. బంగారు గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు చనిపోయారు. ఈ దారుణ ఘటన గురించి అధికారులు చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ ఇచ్చింది. ఈ ఘటన జరిగిన ప్రదేశం చాలా చిన్న బంగారు గని అని అధికారులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బంగారు గనిలో మంటలు చెలరేగాయని చెప్పారు. బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మంటలు చెలరేగిన సమయంలో గనిలో ఎంత మంది ఉన్నారనే దాని గురించి ఎటువంటి నిర్ధారణ లేదు
మినేరా యాంక్విహువా ఈ చిన్న బంగారు గనిని నడుపుతున్నాడు. యాంక్విహువా ఒక చిన్న స్థాయి సంస్థ. కంపెనీ 23 ఏళ్లుగా పెరూలో గనులను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. స్థానిక ప్రాసిక్యూటర్ గియోవన్నీ మాటోస్ ఆదివారం స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో 27 మంది మరణించారని..అధికారులు చెప్పారు.
Peru | 27 people dead after a fire broke out in a small gold mine in southern Peru, Reuters reported citing the authorities
— ANI (@ANI) May 7, 2023
ప్రపంచంలోనే అగ్రస్థానంలో బంగారం ఉత్పత్తి చేసే దేశం పెరూ.. అంతేకాదు రాగి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. పెరువియన్ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ ప్రధానంగా ఉంది. మైనింగ్, ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ సంఘటన 2000 నుండి జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ ప్రమాదం. గత సంవత్సరం, మైనింగ్ సంబంధిత సంఘటనలలో 39 మంది చనిపోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..