TANA 23rd Convention: తానా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. తారక రాముడి ప్రాంగణాన్ని ప్రారంభించనున్న బాలయ్య..

|

Jul 08, 2023 | 6:34 AM

అగ్రరాజ్యం అమెరికాలో తానా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జులై 7వ తేదీ నుంచి 9 వరకు జరుగుతున్న ఈ సంబరాల్లో భాగంగా అమెరికాలోని 18 నగరాల్లో ధీంతానా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐలు అందరూ పాల్గొని సందడి చేశారు.

అగ్రరాజ్యం అమెరికాలో తానా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జులై 7వ తేదీ నుంచి 9 వరకు జరుగుతున్న ఈ సంబరాల్లో భాగంగా అమెరికాలోని 18 నగరాల్లో దిం తానా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐలు అందరూ పాల్గొని సందడి చేశారు. తానా 23వ మహాసభల్లో భగంగా జులై 8వ తేదీన అంటే ఈ శనివారం రోజున ఉదయం 10 గంటలకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ సహా మరికొందరు ప్రముఖులు హాజరవుతున్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించనుంది తానా. అలాగే, తారక రాముని ప్రాంగణం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఎన్టీఆర్ వారసులు నటసింహం బాలయ్య బాబు వీటిని ప్రారంభిస్తారు. ఇక ఎన్టీఆర్ జీవిత ఘట్టాలను వివరిస్తూ, కీలక మైలురాళ్లను వర్ణిస్తూ అరుదైన ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఇకపోతే ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్‌‌కు నివాళులర్పిస్తూ నృత్యం, సంగీతం, ఇతర సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జయవంతుత్సవాలకు అందరూ ఆహ్వానితులేనని తానా ఆహ్వానం పలుకుతోంది. వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

కాగా, తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతుత్సవాల్లో నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బాలయ్య తన భార్య వసుంధర, మనవడితో కలిసి న్యూజెర్సీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తానా ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఇదిలాఉంటే.. అంతకు ముందు లాస్‌ఏంజెల్స్, అట్లాంటా, డెట్రాయిట్, కొలంబస్, ఫిలడల్ఫియా, నార్త్ కరోలినా సహా మరికొన్ని నగరాల్లో దిం తానా వేడుకలు అంగరంగ వైభంగా నిర్వహించారు. ఆయా నగరాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో భారతీయత ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరిని అలరించాయి. చిన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగానే సాగాయి. 5 రోజులపాటు జరుగుతున్న ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..