Indian Student: ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

|

Mar 02, 2022 | 5:35 PM

Russia - Ukraine Crisis: ఉక్రెయిన్ దేశం లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.

Indian Student: ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
Chandan Jindal
Follow us on

Indian Student died in Ukraine: ఉక్రెయిన్ దేశం లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్(Punjab) రాష్ట్రానికి చెందిన చందన్ జిందాల్ (22)(Chandan Jindal) అనే విద్యార్థి… ఉక్రెయిన్(Ukraine) దేశం లో మృతి చెందినట్లు సమాచారం. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌ అనే వ్యాధి కారణంగా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నాడు జిందాల్. అనారోగ్యంగా కారణంగా విన్నిట్సియాలోని అత్యవసర ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మునిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వారి తరలింపు కొనసాగుతోంది. ఇండియాకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. అయితే ఖర్కివ్‌పై రష్యా బలగాలు చేసిన దాడిలో భారత్‌కు చెందిన మెడిసిన్ చదివే నవీన్ శేఖరప్ప చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ భారత విస్తుపోయింది. అంతా సంతాప తెలియజేశారు. మిగతా విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మరో పిడుగులాంటి వార్త.. అవును మరొ భారతీయుడు కూడా చనిపోయాడు. పంజాబ్‌కు చెందిన విద్యార్థి ఒకరు అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అతనికి హర్ట్ అటాక్ రావడంతో కన్నుమూశాడు. అతను అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. ఆస్పత్రిలో ఉండి.. కన్నుమూశాడు.

ఇటు కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్ప.. ఖర్కివ్‌లో స్టోర్‌‌కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌.. మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబసభ్యులతో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఫోన్‌‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమయంలో ప్రతీ క్షణమూ చాలా విలువైనదని, భారత ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో మన విద్యార్థులను సురక్షితంగా వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని రాహుల్ సూచించారు.

Read Also…  Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. వివరాలు సేకరిస్తున్న ఏపీ అధికారులు