PM Modi in Ukraine: కీవ్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీ.. శాంతి స్థాపనే లక్ష్యంగా జెలెన్స్కీ‌తో సంప్రదింపులు!

|

Aug 23, 2024 | 3:28 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు.

PM Modi in Ukraine: కీవ్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీ.. శాంతి స్థాపనే లక్ష్యంగా జెలెన్స్కీ‌తో సంప్రదింపులు!
Pm Modi, Ukraine President Zelenskyy
Follow us on

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియం వద్దకు చేరుకుని అక్కడ యుద్ధంలో మరణించిన చిన్నారులకు నివాళులర్పించారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు 10 గంటల రైలు ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మోదీ కీవ్ చేరుకున్నారు. కీవ్‌లో భారత కమ్యూనిటీ ప్రజలు మోదీకి భారతీయ సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ. ఈ విగ్రహాన్ని 2020లో మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారు.

ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ కౌగిలించుకున్నారు. మోదీ, జెలెన్స్కీ కలిసి ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చిన్నారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఈ చిన్నారులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం మారిన్స్కీ ప్యాలెస్‌లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో ఇద్దరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు భారత్ మాతా కీ జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఆయన ఇక్కడ దాదాపు 200 మంది భారతీయ పౌరులను కలిశారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఆప్యాయత స్పష్టంగా కనిపించింది. ఉక్రెయిన్‌కు చేరుకున్న మొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కీవ్‌లో పర్యటిస్తున్నారు.

మరిన్స్కీ ప్యాలెస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. మోదీకి స్వాగతం పలికేందుకు మారిన్స్కీ ప్యాలెస్‌ను భారత్, ఉక్రెయిన్ జెండాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగపడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో చాలా పెద్ద దేశాల నేతలు కీవ్‌ను సందర్శించడం చూశామని డుజారిక్ అన్నారు. అయితే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శనతో ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నామని డుజారిక్ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత 1991లో ఉక్రెయిన్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు ఏ భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించలేదు. 2022 ఫిబ్రవరి 24న రష్యా దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నాటో దేశాలు తప్ప మరే ఇతర దేశాధినేత ఉక్రెయిన్‌ను సందర్శించలేదు ప్రధాని మోదీ ఈ పర్యటన కూడా ప్రత్యేకం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొన్ని నెలల క్రితం ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..