NRI News: ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు.. కస్టమర్లకు ఊహించని ఝలక్ ఇచ్చిన రెస్టారెంట్..

|

Oct 03, 2021 | 10:15 PM

NRI News: ప్రపంచలో ఎన్నో రకాల జాతుల మనుషులు ఉన్నారు. వారి వారి జీవిన శైలికి తగినట్లుగా ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి.

NRI News: ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు.. కస్టమర్లకు ఊహించని ఝలక్ ఇచ్చిన రెస్టారెంట్..
Spicy Food
Follow us on

NRI News: ప్రపంచలో ఎన్నో రకాల జాతుల మనుషులు ఉన్నారు. వారి వారి జీవిన శైలికి తగినట్లుగా ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి. అంతెందుకు ప్రాంతానికి, ప్రాంతానికి మధ్య కూడా తినే ఆహార పదార్థాల్లో మార్పులు ఉన్నాయి. మన దేశంలోనే చూసుకుంటే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వంటకాలను ప్రజలు తింటుంటారు. అలాంటి ప్రంపచ దేశాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తూర్పు దేశాల ఆహార అలవాట్లకు, పశ్చిమ దేశాల ఆహార అలవాట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక స్పైసీ విషయానికి వస్తే.. ఆసియా దేశాల ప్రజలు తిన్నంత స్పైసీ ఫుడ్‌ను.. తూర్పు దేశాల ప్రజలు తినలేరు. స్పైసీ ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బందులు పడుతారు.

అయితే, అగ్రరాజ్యం అమెరికాలో ఓ రెస్టారెంట్‌కు చెప్పలేని కష్టం వచ్చి పడింది. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు.. స్పైసీ ఫుడ్ అని తెలిసి మరీ ఆర్డర్ ఇస్తుంటారు. ఆపై ఘాటుగా ఉందని, కారంగా ఉందంటూ వంకలు చెబుతూ తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తుంటారు. దాంతో ఆ రెస్టారెంట్ యాజమాన్యం.. సైలెంట్‌గా వారి డబ్బులు వారికి ఇచ్చేస్తుండేది. అయితే, చాలా వరకు కస్టమర్లు ఇలాగే చేస్తుండటంతో ఇక లాభం లేదని భావించి రెస్టారెంట్ యాజమన్యం. సరికొత్త ఐడియాను అమలు చేసింది. అది చూసి కస్టమర్లు బిత్తరపోయారు.

ఇంతకూ ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రం ఫార్గొ ప్రాంతంలో ఓ థాయ్ ఫుడ్ రెస్టారెంట్‌ కస్టమర్లకు ఫుల్ క్లారిటీ ఇస్తూ ఒక నోటీస్ బోర్డును ఏర్పాటు చేసింది. ‘‘మీ అంతటి మీరే స్పైసీ ఫుడ్స్ ఆర్డర్ ఇచ్చి.. ఆ తరువాత ఘాటుగా ఉంది. కారమైంది. నోరు మండింది. అని డబ్బులు రిఫండ్ చేయమంటే కుదరదు. రిఫండ్ ఆప్షన్ ఉండదు.’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు రెస్టారెంట్‌ ఎంట్రీ డోర్‌పై నోటీసు అంటించింది. అంతేకాదు.. ఆ నోటీసులో తమ రెస్టారెంట్ వంటకాల్లో ఎంత కారం ఉంటుందో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అంటే కస్టమర్లు ముందుగానే తమకు ఎంత కారంతో కూడిన ఫుడ్ కావాలో క్లారిటీతో ఆర్డర్ ఇవ్వాలని రెస్టారెంట్ యాజమాన్యం ముందే సూచిస్తోందన్నమాట.

అయితే, కొందరు వ్యక్తులు దీనిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఇది చూసి షాక్ అవుతున్నారు. పాపం ఎంత విసిగించారో అని కొందరు నెటిజన్లు జాలి ప్రదర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ రెస్టారెంట్‌ ఫుడ్‌ చాలా స్పైసీగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Monkey Video Viral: స్పైడర్‌మ్యాన్‌ కోతి స్టంట్స్‌..! లైక్స్ వేటలో వానరం వైరల్ వీడియో..

Bill Viral Video: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ఎమోషనల్ బిల్లు..! వైరల్ వీడియో..

Central Minister Kiren Rijiju dance Video: డ్యాన్స్‌ ఇరగదీసిన కేంద్రమంత్రి..! వావ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో..