Tom Aditya: యూకే రాజకీయాల్లో ప్రవాస భారతీయుల సత్తా.. బ్రిస్టల్ బ్రాడ్లీ స్టోక్ మేయర్ గా ఎన్నారై వ్యక్తి..

|

Jan 27, 2022 | 11:15 AM

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్న భారతీయులు(Indians)  ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు

Tom Aditya: యూకే రాజకీయాల్లో ప్రవాస భారతీయుల సత్తా.. బ్రిస్టల్ బ్రాడ్లీ స్టోక్  మేయర్ గా ఎన్నారై వ్యక్తి..
Tom Aditya
Follow us on

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్న భారతీయులు(Indians)  ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విద్య, వైద్య, ఐటీ, రాజకీయాలు.. ఇలా అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన టామ్ ఆదిత్య (Tom Adithya)  బ్రిస్టల్  లోని బ్రాడ్లీ స్టోక్ (Bristol-Bradley Stoke ) నగర మేయర్ గా ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రంలోని రాణి ప్రాంతానికి చెందిన టామ్ ఆదిత్య  మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఓ బ్యాంక్ లో ఆర్థిక సలహాదారుగా కెరీర్ ప్రారంభించారు. 2002 లో యూకేలోని బ్రిస్టల్ కు వెళ్లిన టామ్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు.

దక్షిణ భారతదేశం నుంచి మొదటి వ్యక్తిగా..

ఆదిత్య సతీమణి పేరు లీనా. వీరిద్దరికి అభిషేక్, అలీనా, అల్బర్ట్, అడోనా, అల్ఫోన్సా అనే ఐదుగురు పిల్లలున్నారు. ప్రస్తుతం తన భార్యా పిల్లలతో కలిసి బ్రాడ్లీస్టోక్ ప్రాంతంలోనే నివాసముంటున్నాడు టామ్.  బ్రాడ్లీస్టోక్ నగర మేయర్ గా ఎన్నికైన ఆదిత్య దశాబ్ధ కాలంగా కౌన్సిలర్ గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం అతను బ్రాడ్లీస్టోక్ సౌత్ వార్డ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  గతంలో డిప్యూటీ మేయర్ గా, ప్లానింగ్ అండ్ ఎన్విరాన్ మెంట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అదేవిధంగా సౌత్ గ్లౌసెస్టర్ షైర్ కౌన్సిల్ కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్ ఫోరమ్ కు ఛైర్మన్ గా వ్యవహరించారు. కాగా దక్షిణ భారతదేశం నుంచి యూకే దేశంలోని ఓ నగరానికి  కౌన్సిలర్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి  ఆదిత్యే కావడం విశేషం. అంతేకాదు కన్జర్వేటివ్ టికెట్ పార్టీపై గెలిచిన మొదటి దక్షిణాది భారతీయుడు కూడా అతనే. ఈ అనుభవంతోనే బ్రాడ్లీస్టోక్ నగరానికి మేయర్ గా ఎన్నికయ్యారు.

Also read: Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..

Hyderabad: నేడు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలివే..

Petrol Diesel Price: స్వల్పంగా తగ్గిన ముడి చమురు ధరలు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..