Gautam Raghavan: ప్రవాసభారతీయుడికి వైట్ హౌస్‎లో కీలక పదవి.. వైట్ హౌస్ PPOగా నియమితులైన గౌతమ్ రాఘవన్..

|

Dec 11, 2021 | 12:14 PM

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ హెడ్‌గా ప్రవాసభారతీయుడు గౌతమ్ రాఘవన్ నియమితులయ్యారు...

Gautam Raghavan: ప్రవాసభారతీయుడికి వైట్ హౌస్‎లో కీలక పదవి.. వైట్ హౌస్ PPOగా నియమితులైన గౌతమ్ రాఘవన్..
Ragavan
Follow us on

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ హెడ్‌గా ప్రవాసభారతీయుడు గౌతమ్ రాఘవన్ నియమితులయ్యారు. గౌతమ్ రాఘవన్‎ను వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ హెడ్‌గా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ UNICEF తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా క్యాథీ రస్సెల్‌ను నియమించాలని కోరిన తర్వాత బిడెన్ రాఘవన్‌కు పదోన్నతి కల్పించారు. క్యాథీ రస్సెల్ ప్రస్తుతం WH PPO అధిపతిగా ఉన్నారు.

క్యాథీ నాయకత్వంలో వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ (PPO) బాగా పని చేసింది. అమెరికన్ ప్రజలకు అందించేలా నిర్విరామంగా కృషి చేస్తోందని బిడెన్ చెప్పారు. “మొదటి రోజు నుండి క్యాథీతో కలిసి పనిచేసిన గౌతమ్ రాఘవన్ PPO కొత్త డైరెక్టర్‌గా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. సమర్థవంతమైన, ప్రభావవంతమైన, విభిన్నమైన సమాఖ్య వర్క్‌ఫోర్స్‌ను నిర్మించాలని కోరుకుంటున్నాను.” అని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాఘవన్ భారతదేశంలో జన్మించాడు. సియాటిల్‌లో పెరిగాడు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. అతను “వెస్ట్ వింగర్స్: స్టోరీస్ ఫ్రమ్ ది డ్రీమ్ ఛేజర్స్, చేంజ్ మేకర్స్, అండ్ హోప్ క్రియేటర్స్ ఇన్‌సైడ్ ది ఒబామా వైట్ హౌస్”కి సంపాదకుడిగా చేశాడు. అతను వాషింగ్టన్, DC లో తన భార్య, కుమార్తెతో నివసిస్తున్నారు. గౌతమ్ రాఘవన్ ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా, వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా జనవరి 20, 2020 నుంచి పని చేస్తున్నారు.

గతంలో బిడెన్-హారిస్ ట్రాన్సిషన్ టీమ్ ద్వారా ప్రెసిడెన్షియల్ డిప్యూటీ హెడ్‌గా పనిచేసిన మొదటి ఉద్యోగి ఆయనే. ” రాఘవన్ కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్ అయిన US ప్రతినిధి ప్రమీలా జయపాల్ (WA-07)కి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. బిడెన్ ఫౌండేషన్‌కు సలహాదారుగా, పౌర హక్కులు, సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించే సంస్థలకు సలహా ఇచ్చారు. “ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో, రాఘవన్ వైట్ హౌస్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ కార్యాలయంలో LGBTQ కమ్యూనిటీతో పాటు ఆసియా అమెరికన్ & పసిఫిక్ ఐలాండర్ కమ్యూనిటీకి అనుసంధానకర్తగా, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌కు వైట్ హౌస్ అనుసంధానకర్తగా, అవుట్‌రీచ్‌గా పనిచేశారు.

Read Also.. Lebanon Explosion: లెబనాన్‎లో భారీ పేలుడు.. 13 మందికి పైగా మృతి.. అసలు ఏం జరిగింది..