America: డెలావేర్ ఆలయంలో హనుమాన్ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ధ్యాన హనుమాన్ విగ్రహ స్థాపన..

|

May 01, 2022 | 11:02 AM

America: అగ్రరాజ్యం అమెరికాలోని డెలావేర్లోని హాకెస్సిన్ ( Hockessin Delaware) ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయం(HIndu Temple) మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం..

America: డెలావేర్ ఆలయంలో హనుమాన్ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ధ్యాన హనుమాన్ విగ్రహ స్థాపన..
Hockessin Delaware
Follow us on

America: అగ్రరాజ్యం అమెరికాలోని డెలావేర్లోని హాకెస్సిన్ ( Hockessin Delaware) ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయం(HIndu Temple) మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఐదు ఎకరాల భూమిలో 1996లో దేవాలయ నిర్మాణం ప్రారంభమై, 2002లో పూర్తిచేయబడింది. అదే సంవత్సరం దేవాలయం ప్రారంభించబడింది. ఈ ఆలయంలో రెండేళ్ల కిందట హనుమాన్  ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇందులో భాగంగా మొదట 2020లో, ఆలయం ప్రవేశద్వారం వద్ద 25 అడుగుల ఎత్తులో, 60,000 పౌండ్ల బరువుతో ఒక భారీ హనుమంతుని విగ్రహం నిర్మించారు. యునైటెడ్ స్టేట్స్‌ మొత్తంలో ఎత్తైన హనుమాన్ విగ్రహమిది. ఈ విగ్రహ మూర్తిని తెలంగాణలోని వరంగల్ నుండి  తీస్కుని వెళ్లి ప్రతిష్టించారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ధ్యాన హనుమాన్ విగ్రహాన్ని స్థాపించనున్నారు.

ఈ మూర్తి తయారీ కోసం రాజస్థాన్ కు చెందిన రాయిని ఎంచుకుని చెన్నైలో తయారు చేయించారు. గతేడాది సుచీంద్ర హనుమంతుని స్థాపన చేశారు. 2023 వ సంవత్సరం ఏడాది తెల్లని మార్బుల్‌తో చేసిన సంజీవిని హనుమంతుని స్థాపన చేయబోతున్నారు. ఇలా 2024 నాటికి హనుమాన్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆలయ సిబ్బంది ప్రణాలికను రెడీ చేసుకున్నారు. ఇక ఆలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు.   ఆలయ, విగ్రహ నిర్మాణాల కోసం ప్రవాసాంధ్రుల నుంచి విరాళాలను సేకరిస్తున్నారు.

 

మరిన్ని ప్రవాసాంధ్రా వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

ఏడుకొండలవాడి ప్రసాదానికి ప్రకృతి బియ్యం.. ‘మా పల్లె ట్రస్ట్‌’ ద్వారా సేకరిస్తున్న దిల్ రాజు

 శ్రీవారి దర్శనానికి ఒక్కరే వెళ్తున్నారా.. అక్కడ ఉండడానికి గల సౌకర్యాలు మీకోసం

Muthayya: మనసుకు హత్తుకునే సినిమా ముత్తయ్య.. మూవీ టీజర్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని